NTV Telugu Site icon

‘జనతా బార్’ లో లక్ష్మి రాయ్!

lakshmi roy

lakshmi roy

లక్ష్మీరాయ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘జనతా బార్’. రమణ మొగిలి దీనికి దర్శకుడు. సన్ షైన్ ఆర్ట్స్ అశ్వర్థ నారాయణ సమర్పణలో రోచిశ్రీ మూవీస్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటోంది. రెండు పాటలు మినహా షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు రమణ మొగిలి తెలియజేస్తూ ”రాయ్‌లక్ష్మీ కెరీర్‌లోనే ఇదొక డిఫరెంట్ చిత్రం. ఆమె పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు” అని అన్నారు.

స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేస్తున్న సెక్సువల్ హరాస్‌మెంట్‌కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇదని రమణ తెలిపారు. కమర్షియల్ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుందని ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్న రాజేంద్ర భరద్వజ్ అన్నారు. ప్రదీప్‌ రావత్, సురేష్, అనూప్‌ సోని, అమన్ ప్రీత్, భూపాల్ రాజ్, విజయ్‌ భాస్కర్, ఉన్ని కృష్ణ, దీక్షాపంత్, అమీక్ష, మిర్చి మాధవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు.