కార్తీకదీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్‌కి సామాన్యులే కాదు సినీ ప్రముఖులు కూడా ఫాన్స్‌గా ఉన్నారు. ఈ విషయాన్ని చాలా మంది ప్రముఖులు స్వయంగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సీరియల్‌పై మంచు లక్ష్మీ ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘కార్తీక దీపం సీరియల్‌తో డాక్టర్ బాబు దీప కోసం ఫస్ట్ టైమ్ తెగ ఏడ్చాడట.. అందుకు మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా మంచు లక్ష్మీ ట్వీట్‌ని డాక్టరు బాబు షేర్ చేస్తూ థ్యాంక్స్ చెప్పాడు.
Karthik from #karthikadeepam cried for the first time anta. My mom is finally happy..
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) May 22, 2021