Site icon NTV Telugu

Nayan: సూపర్ స్టార్ డైలాగ్ తో లేడీ సూపర్ స్టార్ ఇన్స్టా ఎంట్రీ…

Nayanthara

Nayanthara

లేడీ సూపర్ స్టార్ నయనతారని సినిమాల్లో తప్ప బయట ఎక్కడా చూడలేం. ప్రమోషన్స్ కి రాదు, ఇంటర్వ్యూస్ ఇవ్వదు, ఫ్యాన్స్ తో ఎక్కువగా కాంటాక్ట్ లో ఉండదు. ఒకసారి ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో నయనతార మాట్లాడిన మాటలని మీడియా తప్పుగా ప్రచారం చేసింది. అప్పటి నుంచి సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చింది నయనతార. అందుకే నయనతారని చూడాలి అంటే సినిమాలు తప్ప ఇంకొందరి లేకుండా పోయింది అభిమానులకి. ఈ మధ్య విగ్నేష్ శివన్ తో మ్యారేజ్ అయ్యాక నయన్ ఫోటోలు కాస్త ఎక్కువగా బయటకి వస్తున్నాయి కానీ అంతక ముందు అయితే అసలు సినిమాల ఫోటోలు తప్ప ఫోటోషూట్ కూడా చేసేది కాదు. ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించి ఇప్పుడు తనే లేడీ సూపర్ స్టార్ అనిపించుకునే స్థాయికి వచ్చిన నయనతార ఎట్టకేలకు తను పెట్టుకున్న బ్యారియర్స్ ని బ్రేక్ చేసింది.

సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వచ్చిన నయనతార, ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇస్తూ ఫస్ట్ పోస్ట్ కూడా చేసేసింది. కొడుకులు ఉయిర్-ఉల్లాగ్ తో కలిసి వీడియో చేసిన నయనతార… పిల్లలతో స్టైలిష్ గా వైట్ డ్రెస్ లో కనిపించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్ నుంచి హుకుమ్ సాంగ్ కి పిల్లల్ని ఎత్తుకోని నయన్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఎన్నో రోజులుగా నయనతార సోషల్ మీడియా ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ‘ఫాలో’ బటన్ ని నొక్కుతూనే ఉన్నారు. గంట గంటకి నయన్ కి ఫాలోవర్స్ పెరుగుతూనే ఉన్నారు. న‌య‌న‌తార మాత్రం ఇన్‌స్టాగ్రామ్ లో కేవలం ఐదుగురిని మాత్ర‌మే ఫాలో అవుతోంది. త‌న భ‌ర్త విఘ్నేష్ శివ‌న్‌, ఓన్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ రౌడీ పిక్చ‌ర్స్, అనిరుధ్, షారుఖ్‌ ఖాన్‌, మిచెల్ ఒబామా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్స్ ను న‌య‌న‌తార ఫాలో అవుతోంది.

Exit mobile version