Site icon NTV Telugu

Kovai Sarala: దేవుడా.. కోవై సరళ ఏంటీ ఇలా అయిపోయింది

Kovai Sarala

Kovai Sarala

కోవై సరళ.. ఈ పేరు వినగానే ముఖం మీద చిరునవ్వు అలా వచ్చేస్తోంది. ఆమె మాట, ఆమె ముఖం కలలముందు కదలాడుతూ ఉంటుంది. లేడీ కమెడియన్ గా మే కు ఉన్న గుర్తింపు మరెవ్వరికీ లేదు అంటే అతిశయోక్తి కాదు. కామెడీకి బ్రహ్మానందం కింగ్ అయితే క్వీన్ కోవై సరళ అనే చెప్పాలి. ఇక గత కొన్నేళ్లుగా ఆమె సినిమాలలో కనిపించడం లేదు. 2019 లో వచ్చిన `అభినేత్రి 2` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె ఇన్నాళ్లకు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోవై సరళ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సెంబి’. ‘అరణ్య’ చిత్రంతో తెలుగువారికి సుపరిచితుడిగా మారిన ప్రభు సాల్మన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కోవై సరళ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. రఫ్ లుక్ లో తలకు క్లాత్ కట్టుకొని, చిన్నారిని అక్కున చేర్చుకొని దీన స్థితిలో ఉన్నట్లు కనిపించింది. సడెన్ గా చుస్తే ఈమె కోవై సరళనేనా అనే అనుమానం రాకుండా పోదు. ఓ బస్ జర్నీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, సరళ చాలా సీరియస్ పాత్రలో కనిపించనుందని టాక్.. ఈక ఈ చిత్రంలో తంబీ రామయ్య, బాలనటి నీలా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఇన్నాళ్లకు రీ ఎంట్రీ ఇస్తున్న ఈ లేడి కమెడియన్ ఈ సినిమాతో హిట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.

Exit mobile version