NTV Telugu Site icon

Kurchi Tatha: గుంటూరు కారం కుర్చీ తాత అరెస్ట్.. మహేష్ బాబు వల్లనే అంటూ ప్రచారం… అసలు విషయం ఏంటంటే

Kurchi Thatha Arrested

Kurchi Thatha Arrested

Kurchi Tatha arrested: కుర్చీ మడతపెట్టి అని ఒక బూతు డైలాగుతో ఫేమస్ అయిన కాలా పాషా అలియాస్ కుర్చీ తాత అనే ఒక వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి నోటి వెంట వచ్చిన కుర్చీ మడత పెట్టి అని బూతు మాటతోనే గుంటూరు కారం సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పోలీసులు సదరు కూర్చి తాతను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. కుర్చీ తాతను ఎస్ ఎస్ థమన్ వరకు తీసుకెళ్లిన వైజాగ్ సత్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో వైజాగ్ సత్య అనే వ్యక్తి ఉప్పల్ బాలుతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు.

Samantha: ఆ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి సమంత అవుట్.. శృతి ఇన్?

ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా సెలబ్రిటీగా చలామణి అవుతున్నాడు. ఆయన స్వయంగా కుర్చీ తాతను తమన్ వరకు తీసుకువెళ్తే ఇప్పుడు తమన్ దగ్గర డబ్బులు తీసుకుని తాను కాజేసినట్టు కుర్చీ తాత ప్రచారం చేస్తున్నాడని పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఆయన ముందు తనతో బాగానే ఉండేవాడని మహేష్ బాబు నుంచి ఇల్లు ఇప్పించమని అడిగితే నా వల్ల కాదని చెప్పిన తర్వాత ఎదురు తిరిగి ఇలా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని వైజాగ్ సత్య చెబుతున్నారు. వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు పోలీసులు కుర్చీ తాతను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇంకా అందాల్సి ఉంది.

Show comments