NTV Telugu Site icon

Kumari Aunty: మొన్న అక్కడ.. ఇప్పుడు ఇక్కడ.. ఇక నెక్స్ట్ బిగ్ బాసే..?

Kumari

Kumari

Kumari Aunty: సోషల్ మీడియా లో కొద్దిగా ఫేమస్ అవ్వడం ఆలస్యం టీవీ ఛానల్స్ వారి వెంట పడి మరీ షోస్ కు తీసుకొచ్చేస్తున్నాయి. రీల్స్ చేసి ఫేమస్ అయినా.. వివాదాల్లో ఇరుక్కొని ఫేమస్ అయినా.. యూట్యూబ్ లో ఫుడ్ బ్లాగ్స్ వలన ఫేమస్ అయినా.. కచ్చితంగా కొన్నిరోజుల్లో ఈటీవీ లోనో.. మా టీవీలోనో దర్శనమిస్తారు. ఇక గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహిళ కుమారి ఆంటీ. మాదాపూర్ దుర్గంచెరువు దగ్గర ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ప్రారంభించి బిజినెస్ రన్ చేస్తుంది. తన వద్దకు వచ్చిన కస్టమర్స్‌ను నాన్నా, బుజ్జి, కన్నా అంటూ ప్రేమగా పలకరిస్తూ.. రుచికరమైన భోజనం అందిస్తూ ఆకట్టుకుంటుంది. అక్కడ భోజనం చేసిన వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. కుమారి ఆంటీ ఫుడ్‌కు గిరాకీ బాగా పెరిగిపోయింది. కుమారి ఆంటీ ఫుడ్ కోసం జనాలు ఎగబడుతున్నారు. ఆమె స్టాల్ దగ్గరికి యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా క్యూ కడుతున్నాయి అంటే ఆమె క్రేజ్ సోషల్ మీడియాలో ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఆమె ఫేమస్ అవ్వడంతో టీవీ ఛానల్స్ కూడా ఆమెను ఎంటర్ టైన్మెంట్ షోస్ కు తీసుకువస్తున్నారు. ఈ మధ్యనే స్టార్ మా ఛానల్ లో కుమారి ఆంటీ దర్శనం ఇచ్చిన విషయం తెల్సిందే. బిగ్‌బాస్ సీజ‌న్ 7 కంటెస్టెంట్స్‌ అంద‌రూ రీ యూనియ‌న్ గా ఏర్పాటు చేసిన బిబి ఉత్సవంలో కుమారి ఆంటీ వారందరికీ ఫుడ్ పెట్టింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు ఈటీవీ షోలో కుమారి ఆంటీ సందడి చేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమె పాల్గొని అందరికి ఫుడ్ పెట్టింది. అంతేకాకుండా స్కిట్ లో కూడా పాల్గొంది. ఇక ఈ షోస్ చూసిన అభిమానులు.. ఇక నెక్స్ట్ బిగ్ బాసే. అది కూడా కానిచ్చెయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కుమారి ఆంటీ బిగ్ బాస్ లోకి వెళ్తుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Show comments