కేటీఆర్ మంచి నటుడు… ఇంకా నయం సినిమాల్లోకి రాలేదు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కేటీఆర్ మంచి నటుడు… ఇంకా నయం సినిమాల్లోకి రాలేదు’ అంటూ హీరో సుధీర్ బాబు చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. హైటెక్స్‌లో జరిగిన ‘ఇండియా జాయ్’ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. ఇదే వేడుకకు నటుడు సుధీర్ బాబు కూడా విచ్చేశారు. ఆయన తన స్పీచ్ లో భాగంగా కేటీఆర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సుధీర్ బాబు మాట్లాడుతూ “నేను కేటీఆర్‌కి పెద్ద అభిమానిని. ఆయన మంచి రాజకీయ నాయకుడు మాత్రమే కాదు నటుడు కూడా. ఒక నటుడు తన ఒరిజినాలిటీని, మూలాలను మరచిపోయి తన పాత్రలో బాగా నటించాలి. అలాగే ఒక మంచి రాజకీయ నాయకుడు కూడా ప్రజల కోసం పని చేయడానికి తనను, తన కుటుంబాన్ని విడిచి పెట్టాలి. ఒకవేళ సినిమాలో రాజకీయ నాయకుడి పాత్రలో నటించే అవకాశం వస్తే కేటీఆర్‌ని కాపీ కొట్టి నటిస్తాను. కేటీఆర్ సినిమాల్లోకి రానందుకు సంతోషంగా ఉంది” అంటూ కేటీఆర్ పై తనదైన శైలిలో ప్రసంశలు కురిపించారు.
Read Also : ట్రైలర్ : రూపాయ్ పాపాయ్ లాంటిదిరా… దాన్నెలా పెంచి పెద్ద చేయాలంటే…!
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
సుధీర్ బాబు వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ సుధీర్ వ్యాఖ్యలను గుర్తుంచుకుంటానని అన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ “నేను రాజకీయ నాయకుడిలా కనిపించడం లేదా? నేను నటుడిలా కనిపిస్తున్నానా? సరే సుధీర్, ఈ మాటలను నేను గుర్తు పెట్టుకుంటాను’’ అని కేటీఆర్ సరదాగా అన్నారు. సుధీర్ బాబు వ్యాఖ్యలను తాను పూర్తిగా సానుకూలంగానే తీసుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. సుధీర్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ సుధీర్ వ్యాఖ్యలను తాను అంగీకరిస్తున్నానని, స్వాగతిస్తున్నానని చెప్పారు. సుధీర్‌బాబు, కేటీఆర్ మధ్య జరిగిన సరదా సంభాషణ అక్కడ వున్న అందరినీ ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!