Site icon NTV Telugu

Devara Pre-release Event: దేవర ఈవెంట్ పై KTR కీలక వ్యాఖ్యలు

Ntrevent

Ntrevent

KTR Comments on Devara Pre-release Event:’దేవర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‍ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్‍లోని నోవాటెల్ హోటల్‍లో నిర్వహించాలని సినిమా యూనిట్ ముందుగా నిర్ణయించింది. అయితే, ఈ ఇండోర్ ఈవెంట్‍కు అభిమానులు ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా రావడంతో గందరగోళం ఏర్పడింది. అభిమానులు ఒక్కసారిగా నోవాటెల్ హోటల్‍లోకి దూసుకురావడంతో నిర్వాహ‌కులు ఈవెంట్‌ను ర‌ద్దు చేశారు. తాజాగా జూ ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కేటీఆర్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని అధికార రేవంత్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైంది అని పేర్కొన్న ఆయన జూ ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్ కు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పోలీసులు చేతులెత్తేశారని, మేము అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఫంక్షన్ లు సంతోషంగా జరుపుకునే వాళ్ళు అని అన్నారు.

Bigg Boss 8 Telugu: కాంతార టీంకే జై కొట్టిన హౌస్ మేట్స్..

సినిమా ఫంక్షన్ తో పాటు.. అన్ని మతాల పండుగులను సమర్థవంతంగా నిర్వహించామని ఈ సంధర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కామెంట్ చేశారు. ఇక హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా [ప్రమోట్ చేస్తున్న దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి తొలి ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగ ఆదివారం విడుద‌లైన రిలీజ్ ట్రైలర్ కూడా బాగా ఆక‌ట్టుకుంది. ఈ శుక్రవారం సెప్టెంబర్ 27న‌ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో దేవర ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో తార‌క్‌ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించగా ఈ మూవీతోనే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ సినిమాకు త‌మిళ యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

Exit mobile version