మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో 158వ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లితో చేయనున్న సంగతి తెలిసిందే. బాబీ – చిరు కాంబోలో వచ్చిన వాల్తేర్ వీరయ్య హిట్ కావండం, శంకర వరప్రసాద్ సూపర్ హిట్ తో కంబ్యాక్ ఇచ్చిన చిరు నెక్ట్స్ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో ఈ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. MEGA 158లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి చిరంజీవి కూతురు పాత్రలో నటిస్తోందట.
Also Read : Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రెండు డేట్స్ లాక్ చేసిన మేకర్స్
నిన్నటి నుండి ఈ వార్తా వైరల్ గా మారింది. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ స్పందించింది. ఈ సినిమాలో చిరంజీవి కుమార్తె పాత్రలో నటిస్తోందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఎలాంటి సమాచారం ఉన్న మేము అధికారకంగా ప్రకటిస్తాం అప్పటి వరకు ఎలాంటి వార్తలు నమ్మొద్దు అని తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లి ఓ సాలిడ్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. చిరంజీవి మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో ఈ కథను రెడీ చేశాడని, యాక్షన్, ఎమోషన్ రెండింటినీ సమపాళ్లలో మేళవించనున్నారనే టాక్ ఉంది. డాకు మహారాజ్ తో మేకింగ్ పరంగా బాబీ మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు చిరుతో చేసే సినిమాను కూడా టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ ప్రతిష్టాత్మక సినిమాను కన్నడ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా AR రెహమాన్ పేరు పరిశీలనలో ఉంది.
