NTV Telugu Site icon

 Krithi Shetty: ఫ్యాన్స్‌కి ఊహించని షాక్ ఇచ్చిన కృతి శెట్టి.. 

February 7 (31)

February 7 (31)

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది. ఆ తర్వాత వరుస ఆఫర్ లు అందుకున్నప్పటి, సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది. రీజన్ ఏంటో తెలియదు కానీ తెలుగులో ఆమె నటించిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అవ్వడం ఆమె కెరీర్ కు బిగ్ మైనస్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కానీ టాలీవుడ్ లో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు.

అయితే  ఈ మధ్యాకాలంలో టాలీవుడ్‌లో ఫేమ్ అందుకుని.. సరైన హిట్ పడక,ఆఫర్ లు రాక బాలీవుడ్ కి బ్యాగ్ సర్ధుకుంటున్నారు చాలా మంది హీరోయిన్‌లు. కొందరికి అక్కడ కలిసోచ్చిన, మరి కొందరికి మాత్రం ఎలాంటి ఫేమ్ రాలేదు. రష్మిక బాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది, కానీ పూజ హెగ్దె మాత్రం బోర్లపడింది. రీసెంట్ గా కీర్తి సురేష్ కూడా అపజయం పాలయింది. ఇక ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా కృతి శెట్టి కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్ అందుకోవడం సంచలనంగా మారింది.

అది కూడా ఒక ఐటెం సాంగ్ లో చిందులు వేయబోతుందట. అయితే ఒక యంగ్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేస్తే కెరీర్ పోయినట్లే. ఇలాంటి అనుభవాలు చాలా మంది హీరోయిన్లు ఫేస్ చేశారు. మరి ఈ మూమెంట్‌లో కృతిశెట్టి  తీసుకున్న ఈ నిర్ణయం కొంత వరకు రిస్క్ అని చెప్పాలి. అందులోను బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్‌లో నటిస్తే ఖచ్చితంగా ఆమె కెరీర్‌ దెబ్బతిన్నడం కాయం. మరి అన్ని తెలిసిన కృతి శెట్టీ ఈ ఆఫర్‌కి ఎలా ఓకే చేసింది అనేది అర్థం కావడం లేదు అంటున్నారు ఫ్యాన్స్.