ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్టులలో ‘ఆదిపురుష్’ కూడా ఒకటి. రామాయణం ఆధారంగా అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతునన్న ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపించనున్నారు. దర్శకుడు ఓం రౌత్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ కృతి సనన్ కూడా తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసింది. దర్శకుడు ఓం రౌత్ స్వయంగా ఈ విషయాన్నీ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. “ప్రియమైన కృతి, మిమ్మల్ని జానకి పాత్రను చూడటం అద్భుతంగా ఉంది. మీ భాగం షూటింగ్ అప్పుడే పూర్తయ్యిందంటే నమ్మలేకపోతున్నాను. ఎంత అద్భుతమైన ప్రయాణం !” అంటూ కృతితో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశారు.
Read Also : టాప్ విద్యాసంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్
ఇక ఇటీవలే సినిమాలో లంకేశుడిగా కన్పించనున్న సైఫ్ అలీఖాన్ పార్ట్ షూటింగ్ ను కూడా పూర్తి చేసిన విషయం తెలిసిందే. త్రీడీ లో తెరకెక్కుతున్న విజువల్ వండర్ మూవీలో టెక్నీషియన్స్ పడుతున్న కష్టమే ఎక్కువ. సినిమాలో విఎఫ్ఎక్స్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సినిమా షూటింగ్ ను వీలైనంత తొందరగా పూర్తి చేసి ఆ పనిలో నిమగ్నం కానున్నారు ఓం రౌత్. 2022 ఆగష్టు 08న సినిమా విడుదల కాబోతోంది.
