అమితాబ్ ఇంట్లో కృతి సనన్ పాగా

Kriti Sanon rents a new house in Andheri belongs to Amitabh Bachchan

‘వన్’ ఒక్కడినే తో తెలుగువారికి సుపరిచితమై ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది కృతి సనన్. ‘మిమి’ విజయంతో విజయపథంలో దూసుకుపోతోంది. ప్రస్తుతం రాజ్‌కుమార్ రావ్ తో కలసి ‘హమ్ దో హమారే దో’ అనే కామెడీడ్రామాలో నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 29 న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే కొంతకాలంగా ఇంటి వేటలో ఉంది కృతి. తాజాగా ఆ ప్రయత్నంలో సక్సెస్ అయింది. కృతి ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటిలో పాగా వేసింది.

Read Also : ‘లైగర్” హీరోయిన్ ఇంటిపై ఎన్సీబీ దాడులు

×
×
Ad

అమితాబ్ కి చెందిన అంధేరిలోని డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ ను కృతి ప్రస్తుతానికి అద్దెకు తీసుకుంది. త్వరలో ఆక్కడకు మకాం మార్చనుందట. బిగ్ బి లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్ విలువ 31 కోట్లట. అంధేరిలో అట్లాంటిస్ భవనం 27, 28 అంతస్తులో ఈ డూప్లెక్స్ ఉన్నట్లు సమాచారం. ఈ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో కృతి దీపావళి పండగను జరుపుకోనుంది. ఇదిలా ఉంటే కృతి ప్రస్తుతం ‘భేదియా, ఆదిపురుష్, బచ్చన్ పాండే, గణపత్’ వంటి సినిమాలలో నటిస్తోంది.