Krithi Shetty Speech At Macherla Niyojakavargam Pre Release Event: ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కృతి శెట్టి మాట్లాడుతూ.. ఇందులో నితిన్ మాస్ & క్లాస్‌ల పర్ఫెక్ట్ మిక్చర్ అని, ఆ రెండు అవతారాల్లో ఆయన అదరగొట్టాడంటూ కొనియాడింది. ఇందులో నితిన్ ‘మాచర్ల నియోజకవర్గానికి కలెక్టర్ కాబట్టి.. తమ జోడీని పార్ట్నర్ ఇన్ జస్టిస్‌గా అభివర్ణించింది. నితిన్ లాంటి స్నేహితుడు దొరకడం చాలా ఆనందంగా ఉందని, ఆయన పాజిటివ్‌గా ఉంటూ ఎల్లప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంటారని చెప్పింది.
ఇక స్వాతి లాంటి నేటివ్ టచ్ ఉన్న ఒక అమ్మాయి పాత్రలో నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి ధన్యవాదాలు తెలిపింది. ఆయన ఎంతో అంకితభావం ఉన్న దరర్శకుడని, ఆయనతో కలిసి మరోసారి పని చేయాలనుందని ఆకాంక్ష వెలిబుచ్చింది. ఇందులో నటించిన సీనియర్ నటీనటులందరూ తన పట్ల ఎంతో ప్రేమ చూపించారంది. సముద్రఖని తన పాత్రని అవలీలగా పోషించారని పేర్కొంది. ఈ చిత్రం కోసం నటీనటులు సహా టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారని, అందుకు వాళ్లపై తనకు గౌరవముందని, తన సపోర్టివ్‌గా ఉన్న యూనిట్ సభ్యులందరికీ థ్యాంక్స్ అని చెప్పింది.
ఈ నెలలో బింబిసార, సీతారామంల రూపంలో టాలీవుడ్‌కి రెండు బ్లాక్‌బస్టర్ విజయాలు దక్కాయని.. అందుకు చాలా సంతోషిస్తున్నానని కృతి చెప్పింది. తమ సినిమాను కూడా అలాగే ఆదరించి, మంచి సక్సెస్ ఇవ్వాలని కోరింది. ఇక చివర్లో అభిమానుల్ని ఉద్దేశిస్తూ.. స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన బేబమ్మ, ఈ సినిమాని థియేటర్‌కి వెళ్లి చూడాలని కోరింది.