Site icon NTV Telugu

Krithi Shetty : భారీ రెమ్యూనరేషన్… డిమాండ్ మాములుగా లేదు!!

Kriti-Shetty

Krithi Shetty డిమాండ్ సౌత్ లో భారీగా పెరిగిపోయింది. మేకర్స్ రెమ్యూనరేషన్ గా ఆమె ఎంత డిమాండ్ చేసినా ఇవ్వడానికి వెనకాడట్లేదు. ఈ బ్యూటీ కూడా ఇదే అవకాశంగా తీసుకుని రెమ్యూనరేషన్ ను పెంచేస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా డిమాండ్ ఉన్నప్పుడే అవకాశాలతో పాటు భారీ రెమ్యూనరేషన్ ను కూడా అందుకోవాలి మరి ! ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి తన తొలి చిత్రంతోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ఆమె కిట్టీలో అర డజనుకు పైగా తెలుగు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఈ యంగ్ బ్యూటీ కూడా ఇప్పటికే ఒక్కో సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్‌ని కోట్ చేస్తోంది.

Read Also : RGV : తారక్ చరణ్ డేంజరస్… రాజమౌళినీ వదలని వర్మ

ఇక ఇటీవలే సూర్య, బాల క్రేజీ కాంబోలో రాబోతున్న సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకు కృతి పారితోషికాన్ని మరింత పెంచేసిందట. అదే ఇప్పుడు సౌత్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కోసం అమ్మడు ఏకంగా కోటిన్నర అడిగిందట. నిర్మాతలు కూడా ఆమె అడిగిన రెమ్యూనరేషన్ కు వెంటనే ఓకే చెప్పేశారట. కాగా 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో సూర్య, బాలా కాంబో రిపీట్ కాబోతోంది. సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ పేరు పెట్టని ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కృతి శెట్టి ఇప్పుడు “ది వారియర్”, “మాచర్ల నియోజకవర్గం” చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన మరో చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

Exit mobile version