Krithi Shetty : భారీ రెమ్యూనరేషన్… డిమాండ్ మాములుగా లేదు!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krithi Shetty డిమాండ్ సౌత్ లో భారీగా పెరిగిపోయింది. మేకర్స్ రెమ్యూనరేషన్ గా ఆమె ఎంత డిమాండ్ చేసినా ఇవ్వడానికి వెనకాడట్లేదు. ఈ బ్యూటీ కూడా ఇదే అవకాశంగా తీసుకుని రెమ్యూనరేషన్ ను పెంచేస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా డిమాండ్ ఉన్నప్పుడే అవకాశాలతో పాటు భారీ రెమ్యూనరేషన్ ను కూడా అందుకోవాలి మరి ! ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి తన తొలి చిత్రంతోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ఆమె కిట్టీలో అర డజనుకు పైగా తెలుగు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఈ యంగ్ బ్యూటీ కూడా ఇప్పటికే ఒక్కో సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్‌ని కోట్ చేస్తోంది.
Read Also : RGV : తారక్ చరణ్ డేంజరస్… రాజమౌళినీ వదలని వర్మ
Also Read
ఇక ఇటీవలే సూర్య, బాల క్రేజీ కాంబోలో రాబోతున్న సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకు కృతి పారితోషికాన్ని మరింత పెంచేసిందట. అదే ఇప్పుడు సౌత్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కోసం అమ్మడు ఏకంగా కోటిన్నర అడిగిందట. నిర్మాతలు కూడా ఆమె అడిగిన రెమ్యూనరేషన్ కు వెంటనే ఓకే చెప్పేశారట. కాగా 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో సూర్య, బాలా కాంబో రిపీట్ కాబోతోంది. సూర్య 2డి ఎంటర్టైన్మెంట్ సంస్థ పేరు పెట్టని ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కృతి శెట్టి ఇప్పుడు “ది వారియర్”, “మాచర్ల నియోజకవర్గం” చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన మరో చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
తాజావార్తలు
-
Sergio Gor: బంగ్లాదేశ్ ప్రధానితో సెర్గియో గోర్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Captain Rajat Patidar: ఎట్టకేలకు కెప్టెన్సీ కొట్టేసిన రజత్ పాటిదార్.. సంతోషంలో ఆర్సీబీ ఫ్యాన్స్..
-
US: తక్షణమే పశ్చిమాసియాను ఖాళీ చేయండి.. పౌరులకు అమెరికా హెచ్చరిక
-
Success Story: నీరజ్ చోప్రాను మట్టి కరిపించిన రుమేష్ పతిరాగే ఎవరు..? అతడికి క్రికెట్‌తో సంబంధం ఏంటి..?
-
Hyderabad Metro : 25 నిమిషాల్లో ప్రాణం కాపాడిన హైదరాబాద్ మెట్రో..
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!