NTV Telugu Site icon

Krithi Shetty: ఆ పుస్తకం వల్లే ఇంత అందం.. కృతి శెట్టి బ్యూటీ సీక్రెట్ లీక్

Krithi Shetty

Krithi Shetty

Krithi Shetty Reveals her Beauty Secret: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన 20 ఏళ్ల మంగళూరు బ్యూటీ కృతి శెట్టి అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. సమయం దొరికినప్పుడల్లా చర్మ సంరక్షణ కోసం ఆమె చాలా కష్ట పడుతోంది. కృతి చర్మం కొరియన్ చర్మంలా కనిపించడానికి కారణం ఏమిటో ఆమె బయటపెట్టింది. ‘‘నేను చదువుకునే రోజుల్లో అమ్మతో కలిసి పుస్తకాల షాపుకి వెళ్లేదాన్ని, అప్పుడు అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని పుస్తకం కొన్నా. వావ్, నా కుమార్తెకు పుస్తకం కావాలని అమ్మ సంతోషించింది, కానీ నేను ‘హౌ టు బి గార్జియస్’ అనే బుక్ కొన్నాను. ఈ పుస్తకం చదవడం ద్వారా అందం మీద శ్రద్ద పెరిగింది.

Ram Charan: IIFA ఉత్సవానికి రామ్ చరణ్

రోజూ రెట్టింపు శుభ్రపరచడం, ఉదయాన్నే సన్‌స్క్రీన్ అప్లై చేయడం నా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కృతి శెట్టి వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను టోనర్‌ను రోజు వాడుతున్నానని చెప్పింది. అంతేకాదు తాను షుగర్‌ని విడిచిపెట్టినప్పటి నుండి చర్మంలో చాలా మార్పులను చూశానని, ఏ ప్రాడెక్ట్ వాడినా కూడా షుగర్‌ని వదిలేసే మ్యాజిక్ చేయలేదని ఆమె వెల్లడించింది. ఇక బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నాకు స్ఫూర్తి, ఆమె ఆత్మవిశ్వాసం నాకు చాలా ఇష్టం అని కృతి చెప్పుకొచ్చింది. మన చుట్టూ ఉండే పర్యావరణం చాలా ముఖ్యం అని ఆమె అన్నారు. తనకు డ్యూయి స్కిన్, లైట్ మేకప్ అంటే ఇష్టం అని అన్నారు. బాక్సీ కనుబొమ్మను కలిగి ఉండటం ఒక ట్రెండ్, అది కూడా ట్రై చేద్దాం అనుకుని ఆగానని ఆమె అన్నారు. ఖాళీ సమయాల్లో పైలేట్స్, ఏరియల్ యోగా, డ్యాన్స్ చేస్తా, అని కృతి చెప్పింది.

Show comments