Site icon NTV Telugu

Krithi Shetty: అందం కోసం బేబమ్మ తపన.. ఆ పార్ట్ కు సర్జరీ..?

Krithi Shetty About Lingusa

Krithi Shetty About Lingusa

Krithi Shetty: ఉప్పెన చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకొని వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ అందంపై మరింత ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా చిత్ర పరిశ్రమ అనగానే గ్లామర్ ఉండాల్సిందే. గ్లామర్ ఉన్నన్ని రోజులే అవకాశాలు వారి వెంట వస్తాయి. ఇక ఈ విషయాన్ని ముద్దుగుమ్మ ముందుగానే గ్రహించినట్లు కనిపిస్తోంది. అందుకే ముందు నుంచే అందంపై ఫోకస్ పెట్టి సర్జరీల వెంట పడుతుందని టాక్ నడుస్తోంది.

కృతి తన పెదాలకు సర్జరీ చేయించుకొంటున్నదని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బేబమ్మ తన లిప్స్ వెడల్పుగా ఉన్నాయని, అందువల్ల తన ముఖం అందం తగ్గినట్టు కనిపిస్తోందని ఫీల్ అవుతున్నదట.. సర్జరీతో ఆ పెదాలను సరిచేసుకొని మంచిగా చేయించుకోవాలని చూస్తున్నదని వినికిడి. ఇప్పటికే ఒక డాక్టర్ ను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో బేబమ్మ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న అందం సరిపోతుందని, కొత్తగా అందాన్ని కొనితెచ్చుకోవద్దని సలహాలు ఇస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే కృతి శెట్టి నోరు విప్పాల్సిందే..

Exit mobile version