Site icon NTV Telugu

Krithi Shetty : కృతిశెట్టి కలల మీద నీళ్లు చల్లిన బాలీవుడ్ !

Krethi Shety

Krethi Shety

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తన ముద్దు ముద్దు నడవడి, అమాయకమైన లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’, ‘ది వారియర్’ వంటి చిత్రాలతో వరుసగా బిజీ అయిపోయింది. అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కృతి కెరీర్ కొంచెం డౌన్ ట్రాక్‌లోకి వెళ్లింది. ఇక దీంతో కృతి తన దృష్టిని బాలీవుడ్ వైపు మళ్లించింది. “హిందీ ఆడియెన్స్ ముందు తన టాలెంట్ చూపించాలనే డ్రీమ్ చాలా ఏళ్లుగా ఉందట” అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆ కల నిజమయ్యేలా ఒక అవకాశం కూడా వచ్చింది. బాలీవుడ్ సీనియర్ హీరో గోవింద కుమారుడు యశ్వర్ధన్ అహుజా హీరోగా నటిస్తున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా ఫైనల్ అయ్యిందని వార్తలు వచ్చాయి.

Also Read : Varun-Tej : కొత్త లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరుణ్ తేజ్..!

ఈ సినిమాతో కృతి బీ టౌన్ ఎంట్రీ ఖాయమని ఫ్యాన్స్ సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తాజా సమాచారం ప్రకారం, కృతి శెట్టి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం స్పష్టంగా బయటకు రాకపోయినా, స్క్రిప్ట్ మార్పులు, షెడ్యూల్ ఇష్యూలు, లేక వేరే ప్రాజెక్ట్ కమిట్‌మెంట్స్ కారణం కావచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ వార్తతో ఆమె అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. “ఇంత మంచి ఛాన్స్ వదులుకోవడం ఎందుకు?” అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే కృతి శెట్టి మాత్రం ఆ నిరాశలో నిలవకుండా, మళ్లీ కొత్త దిశగా ప్రయత్నాలు చేస్తోందట. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ ప్రాజెక్ట్స్ వింటూ, స్ట్రాంగ్ కం బ్యాక్ కోసం ప్లాన్ చేస్తోంది. “బాలీవుడ్ ఎంట్రీ ఆలస్యమైనా, ఒక సాలిడ్ ప్రాజెక్ట్‌తో వస్తే చాలు” అని ఆమెతో పాటు ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version