Site icon NTV Telugu

NTR30: ఆలు లేదు చూలు లేదు.. అంతా ఉత్తిత్తే!

Krithi Shetty On Ntr30

Krithi Shetty On Ntr30

Krithi Shetty Clarity On NTR30 Offer: జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలోని NTR30 సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి.. హీరోయిన్ గురించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. కచ్ఛితంగా బాలీవుడ్ భామని రంగంలోకి దింపొచ్చని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు తెరమీదకి వచ్చింది. దాదాపు ఈమె ఖరారైనట్టు ప్రచారమూ జరిగింది. కానీ, కొంతకాలం తర్వాత ఈ వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది. స్వయంగా జాన్వీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్ ఆ విషయాన్ని స్పష్టం చేశారు. తన కూతురికి టాలీవుడ్ నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదని క్లారిటీ ఇచ్చారు.

ఆ తర్వాత కొంతమంది కథానాయికల పేర్లు తెరమీదకొచ్చాయి. కానీ, ఎవరూ కన్ఫమ్ కాలేదు. ఇంతలోనే శ్రీలీల, కృతి శెట్టిల పేర్లు వినిపించాయి. తొలుత శ్రీలీలని తీసుకోవచ్చన్న వార్తలు రాగా, ఆ తర్వాత కృతిని ఫైనల్ చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని ఓ ప్రచారం ఊపందుకుంది. యువతలో, ఇండస్ట్రీలో ఆమెకున్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా.. కృతిని తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ నిర్ణయించుకున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. పైగా.. నటన పరంగానూ కృతి అదరగొడుతోంది. అందుకే, ఈ అమ్మడినే తీసుకోవాలన్న ఆసక్తి చూపుతున్నారని, త్వరలోనే ఈ వార్త అధికారికంగా రావొచ్చని గుసగుసలు వినిపించాయి. కానీ, ఈ వార్తల్లోనూ వాస్తవం లేదని తాజాగా తేలిపోయింది. స్వయంగా కృతినే ఈ క్లారిటీ ఇచ్చింది.

ఓ మీడియాతో మాట్లాడిన కృతి.. తనని NTR30 చిత్రబృందం నుంచి ఎలాంటి పిలుపు రాలేదని, తాను ఆ సినిమాకు సంతకం చేయలేదని స్పష్టం చేసింది. తనకు తారక్‌తో కలిసి నటించాలనుందన్న కోరికనైతే వెలిబుచ్చింది కానీ, ఈ సినిమా ఆఫర్ వచ్చిందన్న విషయంలో మాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. దీంతో, కథ మళ్లీ మొదటికే వచ్చింది. మేకర్స్ కథానాయికగా ఎవరిని సెలెక్ట్ చేస్తారో, కాలమే సమాధానం చెప్పాలి.

Exit mobile version