అక్కినేని సుమంత్ నటించిన బోణీ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ బ్యూటీ ఖర్బంద. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన తీన్మార్ సినిమా కృతి చాలా పేరు, గుర్తింపు తెచ్చింది. తీన్మార్ సినిమాతో కెరీర్ టర్న్ అవుతుంది అనుకుంటే ఊహించని విధంగా కృతి తెలుగులో సినిమాలు తగ్గించి నార్త్ లోకి వెళ్లిపోయింది. నార్త్ లో లక్ టెస్ట్ చేసుకున్న కృతి… మంచి సినిమాలనే చేసింది. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించింది కానీ కృతి కెరీర్ కి స్టార్ స్టేటస్ ఇచ్చే రేంజ్ సినిమా మాత్రం పడలేదు. దీంతో కృతి ఖర్బంద హీరోయిన్ గా సోసో కెరీర్ నే సాగించింది.
Read Also: Nani: దేవర రాకపోతే డేట్ కబ్జా… మరి పుష్పరాజ్ ని మరిచిపోయారా?
ప్రస్తుతం రిస్కీ రోమియో సినిమా చేయనున్న కృతి ఖర్బంద… గత కొంతకాలంగా పుల్కిత్ సామ్రాట్ తో ప్రేమలో ఉందనే వార్త వినిపిస్తోంది. వీరే ది వెడ్డింగ్, పాగల్ పంతీ, తైష్ సినిమాల్లో కలిసి నటించిన కృతి-పుల్కిత్ సామ్రాట్ 2019 నుంచి డేటింగ్ చేస్తున్నారు. గతంలో ఆల్రెడీ ఒకసారి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోని విడిపోయిన పుల్కిత్… గత నాలుగేళ్లుగా కృతితోనే ఉంటున్నాడు. ఈ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతూ ఉంటాయి. డేటింగ్ న్యూస్ ని మ్యారేజ్ న్యూస్ గా మారుస్తూ… సామ్రాట్-కృతిల ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. సోషల్ మీడియాలో ఈ జంట ఎంగేజ్మెంట్ ఫోటోస్ పోస్ట్ చేయడంతో… అభిమానులు వైరల్ చేసే పనిలో ఉన్నారు.
Read Also: Kannappa: రంగంలోకి ప్రభాస్… పరమశివుడు ఆగమనానికి సర్వం సిద్ధం