Kannappa: రంగంలోకి ప్రభాస్… పరమశివుడు ఆగమనానికి సర్వం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో ఓసారి హిందీ సినిమాలో క్యామియో ఇచ్చాడు ప్రభాస్. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన సినిమా సమయంలో సాంగ్ లో జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోయిన అప్పటి ప్రభాస్ కి పాన్ ఇండియా బాక్సాఫీస్ కి సోలో కింగ్ గా నిలిచిన ఇప్పటి ప్రభాస్ కి చాలా తేడా ఉంది. బాహుబలి పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్ గా మారిన ప్రభాస్ కి… నార్త్‌లో ప్రభాస్ గుడికట్టే రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఏకంగా ఖాన్ త్రయాన్ని సైతం వెనక్కి నెట్టి… బాలీవుడ్ హీరోలకు వణుకు పుట్టిస్తున్నాడు ప్రభాస్. రెబల్ స్టార్ నుంచి సినిమా వస్తుందంటే చాలు… ఎంత పెద్ద హీరో అయిన సరే వెనకడుగు వేయాల్సిందేనని.. రీసెంట్‌గా సలార్ వర్సెస్ డంకీ వార్ ప్రూవ్ చేసింది. అలాంటి ప్రభాస్ క్యామియే చేస్తున్నాడు అంటే, ఆ సినిమా పై హైప్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మంచు విష్ణు భారీ బడ్జెట్‌తో కన్నప్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్‌లో మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా… భారీ స్టార్ క్యాస్టింగ్‌తో రాబోతోంది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్‌తో పాటు ప్రభాస్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. శివుడిగా కనిపించబోతున్నాడు ప్రభాస్. పార్వతి పాత్రలో నయనతార నటించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే శివపార్వతికి సంబంధించిన పార్ట్‌ని షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ప్రభాస్ ఒక మూడు రోజుల కాల్ షీట్స్‌ని ఇచ్చాడట. ఫిబ్రవరి థర్డ్ వీక్‌లో ప్రభాస్ కన్నప్ప సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ శివుడి పాత్ర రివీల్ అవుతుందని… సినిమా మొత్తానికే ఈ ఎపిసోడ్ మెయిన్ హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణుకి జంటగా ప్రీతీ ముఖుంధన్ హీరోయిన్‌గా నటిస్తుండగా… బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు.
Also Read
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్‌గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
తాజావార్తలు
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!