Site icon NTV Telugu

Krishnam Raju: ప్రభాస్ పిల్లలతో ఆడుకోవాలని ఉంది..

prabhas

prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఎన్నో వాయిదాల తరువాత మార్చి 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమహంస పాత్రలో నటించిన సంగతి తెల్సిందే. ఈ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని, సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.

ఇక ఇటీవల కృష్ణంరాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ” పరమహంస పాత్రలో నన్ను చూస్తే దేవుడిని చూసినట్టుగా ఉందని ప్రభాస్ ఒక ఇంటార్వ్యూలో చెప్పాడు. నిజంగా అది నాకు దక్కిన పెద్ద కాంప్లిమెంట్ గా భావిస్తున్నాను. ఇక నాకంటూ ఉన్న కోరిక ఒకటే.. ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది.. ప్రభాస్ కి పుట్టే పిల్లలతో ఆడుకోవాలని ఉంది. త్వరలోనే ఈ కోరిక తీరుతుందని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి సైతం ప్రభాస్ త్వరలోనే వివాహం చేసుకోనున్నట్లు తెలిపింది. ఇదే కనుక నిజమైతే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో నుంచి ప్రభాస్ తప్పుకున్నట్లే..

Exit mobile version