Site icon NTV Telugu

Prakash Raj: కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ లోగో ఇదే!

Ranga Martandam

Ranga Martandam

 

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం మరాఠీ చిత్రం ‘నటసమ్రాట్’ను తెలుగులో ‘రంగమార్తాండ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి అయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై కాలిపు మధు, వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్స్ బాలకృష్ణ, అలీ రేజా, అనసూయ, శివాత్మిక రాజశేఖర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తాజా ఈ సినిమా లోగోను చిత్ర బృందం ఫైనలైజ్ చేసి, దానిని విడుదల చేసింది. మన అమ్మానాన్నల కథ అనే పేరుతో ఈ లోగోను రిలీజ్ చేశారు. అతి త్వరలోనే టీజర్ ను, ఆ వెంటనే ట్రైలర్ ను విడుదల చేస్తామని, సినిమాను ఆగస్ట్ నెలలో జనం ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు చెబుతున్నారు.

Exit mobile version