NTV Telugu Site icon

Ranga Maarthaanda TRP: స్టార్ హీరోల సినిమాల టీఆర్పీ రేటింగ్స్‌ను మించిన రంగమార్తాండ!

Rangamarthanda World Television Premiere Trp Ratings

Rangamarthanda World Television Premiere Trp Ratings

Ranga Maarthaanda TRP Rating: టాలీవుడ్‌లో ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ అని అందరూ పిలుచుకునే కృష్ణ వంశీ ‘రంగమార్తాండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుకుంది. ఇక ఆ తరువాత అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ఆడియన్స్ ను సైతం మెప్పించింది. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కించిన ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా టీవీలో ప్రసారం అయ్యింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇటీవల స్టార్ మాలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం అవగా ఈ మొదటి ప్రీమియర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Varun Tej 13: VT 13 యాక్షన్ షెడ్యూల్ పూర్తి.. డిసెంబర్‌లో రిలీజ్?

ఈ మధ్య ఓటీటీలో విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత బంపర్ హిట్ అయిన సినిమాలకు, భారీ సినిమాలకు కూడా పెద్దగా రేటింగ్ రావడం లేదు. కానీ ఈ రంగమార్తాండ సినిమా మాత్రం ఏకంగా 5.85 టీఆర్పీ రేటింగ్ రాబట్టడం మామూలు విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ భార్యభర్తలుగా కనిపించగా బ్రహ్మానందం, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, అనసూయ భరద్వాజ, ఆదర్శ్ బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి అందించిన షాయరీ ఆకట్టుకుంది. నేనొక నటుడిని అంటూ సాగిన ఆ షాయరీ తెలుగు సినీపరిశ్రమ మరువలేని నటులందరికీ ట్రిబ్యూట్ లాంటిది.

Show comments