Site icon NTV Telugu

Krishna Burugula: ఒక్కో అడుగు ముందుకు…

Krishan

Krishan

 

ప్రముఖ దర్శక నిర్మాత రవిబాబు రూపొందించిన ‘క్రష్’ మూవీతో హీరోగా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు కృష్ణ బూరుగుల. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా కృష్ణ లోని నటుడిని పరిశ్రమకు తెలియచేసింది. దాంతో కృష్ణ బూరుగుల పలు అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. అతను హీరోగా నటించిన రెండో సినిమా ‘మా నాన్న నక్సలైట్’. పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. అందులో నక్సలైట్ కుమారుడి పాత్రను కృష్ణ పోషించాడు. పుట్టిన తర్వాత చూడని కొడుకు కోసం పరితపించే తండ్రీ, తండ్రి పేరు వినడం తప్పితే కంటితో చూడని కొడుకు… వీరిమధ్య ఆ కథ సాగుతుంది. ఇదిలా ఉంటే… ఇప్పుడు మరో మూడు సినిమాలలో నటిస్తున్నాడు కృష్ణ బూరుగుల.

నటనలో శిక్షణ పొందిన కృష్ణ బూరుగుల షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ, అప్రంటీస్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాల్లో పనిచేస్తూ, చిన్న చిన్న పాత్రలు చేసేవాడు. వందల ఆడిషన్లు ఇచ్చాడు. అతని ప్రతిభను గుర్తించిన దర్శక నిర్మాతలు ఇప్పుడిప్పుడే అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘కృష్ణమ్మ’ చిత్రంలో సెకండ్ లీడ్ రోల్ చేస్తున్నాడు. అలాగే ‘దిల్’ రాజు బ్యానర్ లో హరీష్ శంకర్ సమర్పణలో వస్తున్న ‘ఎ.టి. ఎం.’ వెబ్ సిరీస్ లో ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృష్ణ బ్యానర్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాలు, వెబ్ సీరిస్… తన కెరీర్ కు హెల్ప్ అయ్యేవేనని కృష్ణ బూరుగుల చెబుతున్నాడు.

Exit mobile version