NTV Telugu Site icon

Naresh: ‘మళ్లీ పెళ్లి’లో కృష్ణ, విజయ్ నిర్మల.. ఎవరో గుర్తుపట్టారా ..?

Krishna

Krishna

Naresh: సీనియర్ నటుడు నరేష్- పవిత్రా లోకేష్ లో ప్రేమ వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో ప్రత్యేకంగా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు, విమర్శలు, ఛీత్కారాలు, ముద్దులు, వెకేషన్స్, సినిమా.. బయోపిక్.. ఇలా ఒక్కో స్టేజ్ ను దాటుకుంటూ వస్తున్నారు. సమ్మోహనం సినిమాతో వీరిద్దరి పరిచయం మొదలయ్యింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లివరకు వెళ్ళాలి అనుకున్నారు.. కానీ అంతలోనే నరేష్ మూడో భార్య అడ్డుకట్ట వేసేసింది. నా కొడుకు కోసం న భర్తతో పోరాడతాను అంటూ మంగమ్మ శపథం చేసింది. అదుగో అక్కడినుంచి మొదలయ్యాయి వివాదాలు, విమర్శలు.. ఒకరిమీద మరొకరు.. ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. డబ్బుకోసం ఎంతకైనా దిగజారుద్ది అని భార్యపై నరేష్ అంటే.. ఆ మృగం.. నన్ను ఎంతమందితో ఎఫైర్ నడిపావు అని అడిగాడు అని భర్త నిజ స్వరూపం బయటపెట్టింది రమ్య. సరే ఇదంతా జరిగిన కథ.. అయిపోయిందిగా అంటే.. లేదు అయిపోయిన కథనే తన బయోపిక్ గా తీసుకొస్తున్నాడు నరేష్. అంటే జరిగిన దాంట్లో తన తప్పేమి లేదని నిరూపించుకోవడానికా అంటే ఏమో నిజమేనేమో అని అంటున్నారు అభిమానులు.

Virupaksha: ‘విరూపాక్ష’ ఏ ఓటిటీలోకి రానుందో తెలుసా..?

మళ్లీ పెళ్లి అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ దర్శక, నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా టీజర్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేశారు. మీడియా ముందు ఏదైతే జరిగినదో అదంతా సినిమాలో చూపించేశారు. ఇక ఈ టీజర్ లో అందరి చూపు ఒక చోటు ఆగిపోయింది. అదే కృష్ణ- విజయ నిర్మల. విజయ్ నిర్మల ఒక్కగానొక్క కొడుకు నరేష్ అన్న విషయం తెల్సిందే. కృష్ణ- విజయ్ నిర్మల బంధం గురించి కూడా అందరికి తెల్సిందే. వారు జీవించి ఉన్నప్పుడే వీరి ప్రేమాయణం వారికి తెలుసట. ముఖ్యంగా విజయ్ నిర్మలకు.. వీరి పరిచయం 2018 లో జరుగగా.. విజయనిర్మల 2019 లో కన్నుమూశారు. ఈ ఏడాదిలో నరేష్, పవిత్రను ఇంటికి కూడా తీసుకువెళ్లాడట. టీజర్ లో ఆ ఇన్సిడెంట్ ను కూడా పొందుపరిచారు. ఇక ఈసినిమాలో కృష్ణగా శరత్ బాబు, విజయనిర్మలగా జయసుధ నటించి ఉంటారని, ఆ ఫోటోనే ఇది అని అభిమానులు రీసెర్చ్ చేసి మరీ చెప్పుకొస్తున్నారు. అయితే అది వారేనా..? లేక ఇంకెవరైనానా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇకపోతే విజయనిర్మలకు రమ్య అంటే ఎంతో ఇష్టమట. ఆమె కోసం, ఆమె బిడ్డకోసం విజయనిర్మల ఎన్నోసార్లు కొడుకుకు బుద్ది చెప్పిందని కూడా రమ్య చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments