అజయ్, వీర్తి వఘాని జంటగా నటిస్తున్న సినిమా ‘కొత్త కొత్తగా’. ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై హనుమాన్ వాసంశెట్టి డైరెక్షన్ లో మురళీధర్ రెడ్డి ముక్కర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీలో ఆనంద్, తులసి, కాశీ విశ్వనాధ్, కల్యాణి నటరాజన్, పవన్ తేజ్, ‘ఈ రోజుల్లో’ సాయి ప్రధాన పాత్రలు పోషించారు.
బి.జి. గోవిందరాజులు ఈ చిత్రానికి సమర్పకులు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, పాటలకు చక్కని స్పందన లభించిందని, మూవీని సెప్టెంబర్ 9న విడుదల చేయబోతున్నామని నిర్మాత మురళీధర్ రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తుండగా, వెంకట్ కెమెరామెన్ గా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.