‘కోతల రాయుడు’ కూడా వచ్చేస్తున్నాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి విద్యాసంస్థల నిర్వహణకు ప్రభుత్వం అనుమతిచ్చేసింది. కొన్ని రాష్ట్రాలలోనూ రాత్రి కర్ఫ్యూను, వీకెండ్ లాక్ డౌన్ ను ఎత్తివేశారు. సో… సినిమా నిర్మాతలూ కాస్తంత ఊపిరి పీల్చుకుని ఆశావాహ దృక్పథంతో థియేటర్లలో తమ చిత్రాలను విడుదల చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. అలా దాదాపు రెండేళ్ళ క్రితం మొదలై, విడుదల కాకుండా ఆగిపోయిన శ్రీకాంత్ ‘కోతల రాయుడు’ సినిమా సైతం ఫిబ్రవరి 4న జనం ముందుకు వచ్చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ‘యు’ సర్టిఫికెట్ పొందింది.
సుధీర్ రాజు దర్శకత్వంలో ఎ. ఎస్. కిశోర్, కొలన్ వెంకటేశ్ నిర్మించిన ‘కోతల రాయుడు’కు సునిల్ కశ్యప్ సంగీతం అందించాడు. శ్రీకాంత్ సరసన అందాల భామలు డింపుల్ చోప్డా, నటాషా దోషి, ప్రాచీ సిన్హా నటించారు. మాటలతో మాయచేసే పాత్రను శ్రీకాంత్ చేస్తున్నాడని, అందుకే ‘కోతల రాయుడు’ అనే టైటిల్ పెట్టామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. గతంలో చిరంజీవి హీరోగానూ ‘కోతలరాయుడు’ పేరుతో ఓ సినిమా వచ్చింది. మరి ‘అఖండ’లో ప్రతినాయకుడిగా నటించి మెప్పించిన శ్రీకాంత్ ఇప్పుడీ ‘కోతల రాయుడు’గా ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
Also Read
- Devara 2 Update : 'వర'కు ఏమైంది ?... జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
- Peddi Controversy : 'పెద్ది' ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్... ఏమన్నారంటే?
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
తాజావార్తలు
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!