NTV Telugu Site icon

Kotabommali PS Teaser: శ్రీకాంత్ నట విశ్వరూపం.. అదిరిపోయిన కోటబొమ్మాళీ టీజర్

Srikanth

Srikanth

Kotabommali PS Teaser: నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో హీరోగా మారి.. ఫ్యామిలీ ఆడియెన్స్ ను తన నటనకు ఫిదా అయ్యేలా చేసుకున్నాడు. ఇక మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీకాంత్.. కొత్త తరం హీరోలు రావడంతో.. హీరో క్యారెక్టర్స్ కు స్వస్తి పలికి.. విలన్ గా, సపోర్టివ్ రోల్స్ తో మెప్పిస్తున్నాడు. ఈ మధ్యనే స్కంద సినిమాలో మంచి రోల్ లో నటించి మెప్పించిన శ్రీకాంత్.. చాలా గ్యాప్ తరువాత హీరోగా మారి నటిస్తున్న చిత్రం కోటబొమ్మాళి PS. జోహార్‌, అర్జున ఫల్గుణ సినిమాలు చేసిన తేజ మార్ని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో భారీ హిట్ అందుకున్న నాయట్టు అనే సినిమాకు అధికారిక రీమేక్ గా కోటబొమ్మాళి తెరకెక్కింది. పొలిటికల్ సర్వైవల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్, శివాని రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, లింగి లింగిడి సాంగ్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Bigg Boss Telugu 7: కాళ్లు పట్టుకొని బతిమిలాడిన అశ్విని.. ఫైర్ అయిన శివాజీ

ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కథ మొత్తాన్ని రివీల్ చేయకుండా ఆసక్తికరంగా టీజర్ ను కట్ చేశారు. పొలిటీషియన్ గా మురళీ శర్మ కనిపించాడు. అతడి కింద పని చేసే పోలీసులు.. వారితో రాజకీయ నాయకులు చేసే రాజకీయం ఎలా ఉంటుంది. ప్రజల నుంచి ఓట్లు రాబట్టుకోవడానికి రాజకీయ నాయకులు ఎలాంటి పనులు చేస్తారు.. ? దానివలన అమాయకులు ఎలా బలవుతున్నారు..? అనేది ఈ సినిమాలో చూపించారు. ఇక రామకృష్ణ అనే పాత్రలో శ్రీకాంత్ కనిపించాడు. అసలు డైలాగ్స్ కానీ, ఆ యాక్షన్ గాని అదరగొట్టేశాడు. హీరోగా శ్రీకాంత్ చాలా గ్యాప్ తరువాత నట విశ్వరూపం చూపించాడు. నవంబర్ 24 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Show comments