Site icon NTV Telugu

Kota Bommali: సిన్న, పెద్ద అని లేకుండా అందరితో సిందేయించే శ్రీకాకుళం పాట

Kota Bommali

Kota Bommali

పల్లె పాటలు, పక్కా ఫోక్ సాంగ్స్ ని వినడానికి ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. పలాస సినిమాలోని నాదీ నక్కిలీసు గొలుసు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసిన రీసౌండ్ వచ్చే రేంజులో వినిపించిన ఆ సాంగ్ తర్వాత తెలుగులో మళ్లీ సరైన శ్రీకాకుళం ఫోక్ సాంగ్ బయటకి రాలేదు. ఆ లోటుని తీరుస్తూ “లింగి లింగి లింగడి” సాంగ్ బయటకి వచ్చేసింది. గీత ఆర్ట్స్ 2 నుంచి వస్తున్న ‘కోట బొమ్మాలి’ సినిమా నుంచి ఈ శ్రీకాకుళం ఫోక్ సాంగ్ రిలీజ్ అయ్యింది.

Read Also: Esha Gupta : టూ పీస్ బికినీలో ఈషా టెంప్టింగ్ హాట్ లుక్ వైరల్..

మలయాళంలో హిట్ అయిన నాయట్టు సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న కోట బొమ్మాలి సినిమాని తేజ డైరెక్ట్ చేసాడు. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ నటిస్తున్న కోట బొమ్మాలి సినిమాకి మిథున్ ముకుందన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కోట బొమ్మాలి సినిమాకి నేటివిటీని మ్యాచ్ చేస్తూ మంచి సాంగ్ ని ఇచ్చారు. “లింగి లింగి లింగడి” సాంగ్ ని ‘రేలారే ఫేమ్ రఘు’ పాడగా విజయ్ పోలకి మాస్టర్ డాన్స్ కంపోజ్ చేసాడు. ఫుల్ ఆన్ ఎనర్జి ఉన్న ఈ సాంగ్ రాబోయే రోజుల్లో ప్రతి చోటా వినిపించడం గ్యారెంటీ.

Exit mobile version