యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల ప్రాజెక్ట్ గురించి అంతా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ‘ఎన్‌టిఆర్30’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్తుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ 30 ను ఎన్‌టీఆర్ ఆర్ట్స్ సహకారంతో యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తుంచనున్నారు. ఇతర తారాగణం, తెక వివరాలు ఇంకా ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం “ఎన్‌టిఆర్30” కోసం యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ను తీసుకురావాలని కొరటాల శివ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు అనిరుధ్ తెలుగులో ‘అజ్ఞాతవాసి’, ‘గ్యాంగ్ లీడర్,‘ జెర్సీ’ వంటి తెలుగు చిత్రాలకు స్వరాలు సమకూర్చిన విషయం తెలిసిందే. 2016లో వచ్చిన “జనతా గ్యారేజ్” చిత్రం తర్వాత ఎన్టీఆర్, అనిరుధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.