డిజిటల్ రికార్డులని చెల్లా చెదురు చేస్తూ దేవర గ్లిమ్ప్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ ని మాస్ మహారాజాగా చూపించి నందమూరి అభిమానులనే కాదు పాన్ ఇండియా మూవీ లవర్స్ ని ఇంప్రెస్ చేసింది. బ్లడ్ మూన్ షాట్ నుంచి ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తేరుకోలేదు. కొరటాల శివ కంబ్యాక్ ని ఊహించారు కానీ ఈ రేంజ్ సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని ఎవరు కలలో కూడా అనుకోని ఉండరు. ఎర్ర సముద్రంలో దేవర చేసిన విధ్వంసం ఏ పాటిదో తెలియాలి అంటే ఏప్రిల్ 5 వరకూ వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడున్న అంచనాలని మాత్రం దేవర గ్లిమ్ప్స్ అమాంతం పెంచేసింది. ఇదే హైప్ ని బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో మరో నాలుగు నెలలు మైంటైన్ చేస్తే చాలు… సరిగ్గా నాలుగు నెలల తర్వాత ఈ సమయానికి దేవర బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూ ఉంటాడు.
దేవర గ్లిమ్ప్స్ చూసిన ప్రతి ఒక్కరు ఎన్టీఆర్, అనిరుధ్, కొరటాల శివలపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా కొరటాలపై అన్ని వర్గాల ఆడియన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన ఒక కొత్త కమర్షియల్ సినిమా రైటర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ, ఆచార్య సినిమాతో చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. నెలల పాటు అండర్ గ్రౌండ్ వెళ్లిపోయి దేవర కోసం సాలిడ్ గా వర్క్ చేసి కంబ్యాక్ ఇచ్చాడు. ఈ కంబ్యాక్ ఇంపాక్ట్ ఈరోజు ప్రతి ఒక్కరు కొరటాల శివని మెచ్చుకునేలా చేస్తుంది. సోషల్ మీడియా అంతా కొరటాల శివ పేరు మారుమోగుతూ ఉంటే ఇలాంటి సమయంలో ఆచార్య హిందీ వర్షన్ లో యూట్యూబ్ లో రిలీజ్ చేస్తూ పెన్ మూవీస్ అనౌన్స్ చేసింది. జనవరి 11న పెన్ మూవీస్ యూట్యూబ్ ఛానెల్ లో ఆచార్య హిందీ వెర్షన్ రిలీజ్ అవుతుంది చూడండి అంటూ ఆచార్య ట్రైలర్ ని కూడా పోస్ట్ చేసాడు. ఈ సినిమాని ఇన్ని రోజులు ఎందుకు రిలీజ్ చేయలేదు? ఇప్పుడే ఎందుకు చేసారు అనేది పెన్ మూవీస్ కే తెలియాలి.
#Acharya trailer is here! Get ready for an entertainment extravaganza!#MegastarChiranjeevi #RamCharan #PenMovies pic.twitter.com/lzrhAsBaoI
— Pen Movies (@PenMovies) January 8, 2024