Site icon NTV Telugu

NAT Health CSR Award: ప్రతిష్టాత్మక పురస్కారం పొందిన ఉపాసన

సెలబ్రిటీ హోదాను సామాజిక సేవకు ఉపయోగించాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల. సమాజ హితమే కాకుండా పర్యావరణ హితమైన కార్యక్రమాల్లోనూ ఆమె చురుకుగా పాల్గొంటారు. హ్యూమన్ లైఫ్ తో పాటు వైల్డ్ లైఫ్ ను కాపాడాలనేది ఉపాసన ఆలోచన. ఈ దిశగా తన సేవలు అందిస్తున్న ఆపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ వైస్ ఛైర్ పర్సన్ ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డ్ దక్కింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి గుర్తింపుగా 2022 ఏడాదికి గాను ఆమె ఈ పురస్కారాన్నిఅందుకోనున్నారు.

ఓ గొప్ప కార్యక్రమంలో తనను భాగం చేసిన తాతయ్య, అపోలో ఆస్పత్రుల ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికే ఈ అవార్డ్ ఘనత దక్కుతుందని ఉపాసన కొణిదెల ఈ సందర్భంగా అన్నారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా వైద్య సేవలను మెరుగుపర్చాలనే ఆయన లక్ష్యమే తనకు స్ఫూర్తినిచ్చిందని ఆమె చెప్పారు. రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామరాజు పాత్రతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటుండగా, ఆయన సతీమణి ఉపాసన తన కెరీర్ లో భర్త గర్వించే పురస్కారాలు అందుకోవడం విశేషం.

Exit mobile version