Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు

Kona Venkat News

Kona Venkat News

టాలీవుడ్‌లో పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక సినిమా లేదా రెండు సినిమాలు చేస్తే థియేటర్లు, క్యాంటీన్లు కళకళలాడుతాయని కోన వెంకట్ అభిప్రాయపడ్డారు. అయితే హీరోలు కేవలం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటూ కేవలం భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి సంవత్సరాల తరబడి కాలం వృధా చేస్తున్నారని విమర్శించారు. కథలు లేవనేది అబద్ధమని, మంచి కొత్త దర్శకులు, బలమైన కథలు సిద్ధంగా ఉన్నప్పటికీ స్టార్ హీరోలు వాటిని పట్టించుకోవడం లేదని ఆయన ఘాటుగా స్పష్టం చేశారు. ఒక్కొక్క హీరో త్రీ ఇయర్స్, ఫోర్ ఇయర్స్ వాళ్ళు బ్లాక్ అయిపోయి… సో ఒక పక్కన థియేటర్స్… నాకు మీ నెంబర్… నా ఫోన్‌లో నరసరావుపేట థియేటర్ ఓనర్ నాకు లిస్ట్ పెట్టాడు, నిన్న మార్నింగ్ షో కి ఎన్ని సమోసాలు అమ్మాడు, నిన్న మ్యాట్నీకి ఎన్ని సమోసాలు అమ్మాడు, నిన్న సెకండ్ షోకి ఎన్ని సమోసాలు అమ్మాడు! నిజంగా మీకు చూపిస్తా ఇది, మీకు మీ అవగాహన కోసం చూపిస్తా లిస్ట్. అంటే హి వాజ్ సో హ్యాపీ, “ఇన్ని సమోసాలు అమ్మి నేను ఎంత కాలం అయింది” అని సార్. అంటే సో అటువంటి వాళ్ళు మరి ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి వాళ్ళు సంవత్సరానికి ఒక సినిమా, రెండు సినిమాలు చేస్తే సమోసాల ఫ్యాక్టరీ పెట్టేసుకుంటారు కదా వాళ్ళు! అంటే ఎంత కలకలలాడుతది? క్యాంటీన్ పార్కింగ్ కూడా పెట్టాడు తెలుసా?

ఇప్పుడు మీకో విషయం చెప్పనా? మీరు అసలు… మీరు ఎంతమంది దగ్గర విన్నారు, కథలు చెప్పండి నాకు? ఎంతమందిని పిలిచారు ఇంటికి, మీ ఆఫీస్ కి? కథలు లేవో, రావట్లేదు అన్నది నేను ఒప్పుకోను. నాకు అవకాశం ఇస్తే ప్రతి హీరోకి కొంతమంది కొత్త డైరెక్టర్లతో, రీసెంట్ గా వచ్చిన డైరెక్టర్స్… నేను ప్రతి ఎవ్రీ వీకెండ్ తీసుకెళ్లి ప్రతి హీరో దగ్గర కూర్చోపెట్టగలను విత్ స్టోరీ. అది కాదు, వాళ్ళకి సంథింగ్ దే వాంట్ లార్జర్ దాన్ లైఫ్! లార్జర్ దాన్ లైఫ్, కలెక్షన్స్, పాన్ ఇండియా, పాన్ వరల్డ్, హాలీవుడ్… ఈ రేంజ్ కి వెళ్ళిపోదాం అని. తెలుగులో ఇప్పుడు ‘పుష్ప’ సినిమా ఉంది, ‘బాహుబలి’ ఉంది, తెలుగులో తీశారు, వాళ్ళు అది అల్టిమేట్‌గా పాన్ ఇండియా అయ్యింది. ‘కాంతార’ ఉంది, వాళ్ళు కన్నడ ఇండస్ట్రీ కోసమే తీశారు. వాళ్ళు ఇక్కడ ఆడుతుందని వాళ్ళు అనుకోలేదు ఆ క్షణం తీసినప్పుడు. స్లోగా అలాగా మనం నిజాయితీ… అట్లీస్ట్ మన భాష వరకు మనం పరిమితమయ్యి, మన ఆడియన్స్ ని ఏం చేసి, మన ఆడియన్స్ కి దూరం అయిపోయి, వాళ్ళు పక్క భాషకి వెళ్ళిపోయి, లేకపోతే ప్రపంచం అంతా వెళ్ళిపోద్దాం అన్నది కరెక్ట్ కాదేమో అన్నది నా ఫీలింగ్ అంటూ ఆయన కామెంట్ చేశారు.