కోలీవుడ్‌లో కొన్ని సినిమాలకు మోక్షం దక్కడం లేదు. కోర్ట్ ఇష్యూస్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, పోస్ట్ ప్రొడక్షన్స్ వల్ల పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. కాస్త టైం తీసుకున్నా సూర్య కరుప్పు, ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ థియేటర్స్‌లోకి వచ్చేశాయి. కానీ ఇంకొన్ని సినిమాలు రావాలా వద్దా అనే మీమాంసలోనే బతికేస్తున్నాయి. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది విక్రమ్- గౌతమ్ వాసు దేవ్ మీనన్ కాంబోలో తెరకెక్కిన ధ్రువ నక్షత్రం. 2015లో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమాకు అన్నీ అవరోధాలే. ఫైనాన్షియల్ ఇష్యూస్, న్యాయపరమైన చిక్కుల్లో పడి విడుదలకు నోచుకోవడం లేదు. దీనిపై విచారణ చేపట్టిన కోర్ట్ అపోజిట్ వ్యక్తులకు డబ్బులు చెల్లించి.. జూన్ 15లోగా మూవీని రిలీజ్ చేసుకోవచ్చునని తీర్పునిచ్చింది. కానీ రిలీజ్ చేయడానికి ఈ సమయం సరిపోదూ.. మరింత టైం కావాలని కోరుతూ మళ్లీ కోర్టును ఆశ్రయించాడు గౌతమ్ వాసు దేవ్ మీనన్.
విజయ్ సేతుపతి- మిస్కిన్ కాంబోలో వస్తోన్న మూవీ ట్రైన్. 2023లో పట్టాలెక్కిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు తెరపై దర్శనమివ్వలేదు. రెండున్నర గంటల పాటు ట్రైన్‌లో సాగే మూవీ కావడంతో సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు టైం పడుతుండటంతో సినిమా రిలీజ్ డేట్ చెప్పలేకపోతోంది మూవీ టీం. కానీ త్వరలోనే ల్యాబ్ నుండి బయటకు వచ్చేయబోతోందట ఫిల్మ్. ఇదే కాదు మిస్కిన్ మరో మూవీ పిశాచు2ది కూడా ఇదే పరిస్థితి. అయితే ఇదెప్పుడు దర్శనమిస్తుందో క్లారిటీ లేదు. దళపతి విజయ్ జననాయగన్ గురించి అందరికీ తెలిసిన కథే. సెన్సార్ ఇష్యూతో స్ట్రగులైన ఈ మూవీ సుప్రీం కోర్టు వరకు వెళ్లి యూటర్న్ తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూవీ వస్తుందనుకుంటే రాలేదు. దళపతి విజయ్ బర్త్ డే సందర్భంగా జూన్ 19న వస్తుందని ఊదరగొట్టారు కానీ రాలేదు. ప్రొడ్యూసర్ త్వరలో రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు కానీ ఎప్పుడో చెప్పడం లేదు. ఇదే కాదు నివిన్ పౌలీ నటించిన యుజు మలై, యుజు కాదల్ మూవీకి కూడా చాన్నాళ్లుగా మోక్షం దక్కడం లేదు. ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఏంటో?

