Site icon NTV Telugu

Kollywood: దీపావళికి కోలీవుడ్ లో బిగ్ ఫైట్…

Kollywood

Kollywood

కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అయలాన్’. సైన్క్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని రవికుమార్ డైరెక్ట్ చేశాడు. రెహమాన్ మ్యూజిక్ తో, భారి విజువల్ ఎఫెక్ట్స్ తో, కోలీవుడ్ లోనే భారి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మేకర్స్ లాంచ్ చేశారు. ఎలియన్, శివ కార్తికేయన్ ఉన్న ఈ పోస్టర్ హిందీలో హృతిక్ రోషన్ నటించిన ‘కోయి మిల్ గయా’ సినిమాని గుర్తు చేసేలా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని దీపావళికి రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మేకర్స్, రిలీజ్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశారు. 2023లో దీపావళి నవంబర్ 12న వచ్చింది, అది ఆదివారం కాబట్టి దాదాపు నవంబర్ 10న అయలాన్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. భారి అంచనాలు ఉన్న ఈ సినిమా దీపావళికి వస్తుందని తెలియగానే కోలీవుడ్ వర్గాలు షాక్ అయ్యాయి. ఇందుకు కారణం ఇదే దీపావళికి మరో రెండు హ్యూజ్ ప్రాజెక్ట్స్ రిలీజ్ కి రెడీ అవుతుండడమే.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో, పాన్ ఇండియా మొత్తం మార్కెట్ క్రియేట్ చేసుకున్న ధనుష్ దీపావళిని టార్గెట్ చేస్తూ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా చేస్తున్నారు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారి బడ్జట్ సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా వైడ్ సాలిడ్ బజ్ ఉంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని ధనుష్ అగ్రెసివ్ గా ప్రమోట్ చెయ్యడం గ్యారెంటీ. ఇదే సమయంలో కార్తీ నటిస్తున్న ‘జపాన్’ సినిమా కూడా రిలీజ్ కానుంది. రాజు మురుగన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కార్తీ కంప్లీట్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. కార్తీ లుక్ మార్చిన ప్రతిసారి సాలిడ్ హిట్ పడుతుంది. ఇప్పటివరకూ జపాన్, కెప్టెన్ మిల్లర్ సినిమాల మధ్యనే పోటీ ఉంటుందని కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావించాయి కానీ ఎవరూ ఊహించని విధంగా రేస్ లోకి వచ్చాడు శివ కార్తికేయన్. తమిళనాడులో ఉన్న థియేటర్స్ ఇద్దరు స్టార్ హీరోల రెండు సినిమాలకి మాత్రమే న్యాయం చెయ్యగలవు కాబటి ఈ మూడు సినిమాల్లో ఏది వాయిదా పడుతుంది అనేది చూడాలి. ఇప్పటికైతే కోలీవుడ్ బాక్సాఫీస్ వార్ కి శివ కార్తికేయన్, ధనుష్, కార్తీ ముగ్గురూ రెడీగా ఉన్నారు.

Exit mobile version