Pradeep Ranganathan : కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. వరుస హిట్లతో ఆయన ఫుల్ జోష్ మీదున్నాడు. ఇప్పటికే లవ్ టుడ్ సినిమాతో యూత్ ను కట్టి పడేశాడు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ వంద కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాకు హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. దీని తర్వాత డ్రాగన్ సినిమా తీశాడు. ఆ మూవీ కూడా సెన్సేషనల్ హిట్ అయింది. అది ఏకంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీతో ప్రదీప్ మార్కెట్, రేంజ్ అమాంతం పెరిగిపోయాయి.
Read Also : Chiranjeevi : చిరంజీవిని అలా చూసి నా మనసు ఉప్పొంగిపోయింది.. బండ్ల ఎమోషనల్
ఇప్పుడు తాజాగా డ్యూడ్ సినిమాతో వచ్చాడు. ఇది కూడా మంచి హిట్ అయింది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. ఈ సినిమాతో మరింత జోష్ లో ఉన్నాడు ప్రదీప్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ప్రదీప్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు. ఆయన మొత్తం ఆస్తులు రూ.20 కోట్ల దాకా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రదీప్.
Read Also : Samantha : భోజనం చేయడానికి డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా.. సమంత ఎమోషనల్
