ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ది వారియర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక తాజాగా ఈ సినిమాలోకి మరో స్టార్ హీరో యాడ్ అయ్యాడు. రామ్ కోసం కోలీవుడ్ స్టార్ హీరో శింబు రంగంలోకి దిగాడు.. ఏంటి శింబు గెస్ట్ రోల్ చేస్తున్నాడా..? అంటే కాదండి.. వారియర్ కోసం శింబు మరోసారి సింగర్ గా మారాడు.శింబు మంచి సింగర్ అన్న విషయం అందరికి తెల్సిందే.
తెలుగులో మంచు మనోజ్ సినిమాలకు శింబు గాత్రం అందించిన విషయం విదితమే. ఇక మరోసారి రామ్ కోసం శింబు ఒక ఎనర్జిటిక్ పాటను పాడబోతున్నాడట. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ సాంగ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే రామ్- లింగుస్వామి కాంబోపై భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులకు ఈ విషయం కూడా తెలియడంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషలో రిలీజ్ అక్కనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి దేవి- శింబు కాంబోలో వస్తున్నా ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.