కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులోనూ సుపరిచితుడే . అయన నటించిన తమిళ్ సినిమాలు తెలుగులో డబ్ అవుతాయి. ఇప్పటివరకు టాలీవుడ్ లో స్ట్రైట్ ఫిల్మ్ లో నటించని ధనుష్ తాజాగా తన స్ట్రైట్ ఫిల్మ్ ప్రకటించేశాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో చిత్రంతో తన డైరెక్ట్ తెలుగు సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాకు ‘తొలిప్రేమ’ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా.. సూర్యదేవర నవ వంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
ఇక ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను డిసెంబర్ 23 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బై లింగువల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారు. విభిన్న ప్రేమ కథలను తెరకెక్కించడంలో వెంకీ అట్లూరి సిద్ద హస్తుడు. ఇక ఇటీవల నితిన్ తో రంగ్ దే చిత్రంతో అపజయాన్ని చవిచూసిన డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ తో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. మరి వీరి కాంబో ఎలా ఉండబోతుందో చూడాల్సిఉంది.
