NTV Telugu Site icon

Naga Chaitanya: కోలీవుడ్ డైరెక్టర్స్.. టాలీవుడ్ కు సెట్ కారా..?

Venkat

Venkat

Naga Chaitanya: ఒక భాషలో హిట్ అందుకున్న డైరెక్టర్స్ కానీ, హీరోలు కానీ.. మరో భాషలో పాగా వేయాలని చూస్తారు. అయితే ఒకప్పుడు అంటే అదో గొప్ప విషయం కానీ, ఇప్పుడు పాన్ ఇండియా వచ్చాకా.. భాషతో పనిలేకుండా పోయింది. అయితే అందరికి హిట్లు వస్తాయి అన్న నమ్మకం లేదు. ఇక ముఖ్యంగా బైలింగువల్ సినిమాలుగా వచ్చిన చిత్రాలు గురించి మాట్లాడుకోవాలి. ప్రస్తుతం టాలీవుడ్.. అన్ని ఇండస్ట్రీలను ఏలేస్తోంది. టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు.. వేరే భాషల్లో ఎంట్రీ ఇచ్చి హిట్లు అందుకుంటున్నారు. ఇక వేరే భాష హీరోలు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి హిట్లు అందుకుంటున్నారు. కానీ, ఒక్క కాంబో మాత్రమే.. తేడా కొట్టేస్తూ వస్తుంది. అదే టాలీవుడ్ హీరో- కోలీవుడ్ డైరెక్టర్. తమిళ దర్శకులు చాలామంది తెలుగులో పాగా వేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.కానీ, అందులో కొద్దిమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. ఇక ఈ మధ్యకాలంలో కోలీవుడ్ డైరెక్టర్స్ లక్ అస్సలు బాగోలేదని తెలుస్తోంది. మొన్నటికి మొన్న.. రామ్ పోతినేనితో కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి.. ది వారియర్ అని ఒక సినిమాను తెరకెక్కించాడు. బై లింగువల్ గా తెరకెక్కిన ఈ సినిమ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. లింగుసామి.. తమిళ్ లో మంచి హిట్ సినిమాలనే అందించాడు. కానీ, తెలుగులోకి వచ్చేసరికి పెద్ద డిజాస్టర్.

The Kerala Story: సినిమాను ఎందుకు బ్యాన్ చేశారు.? బెంగాల్ సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..

ఇక ఇప్పుడు ఇదే సీన్ కస్టడీ విషయంలో రిపీట్ అయ్యిందా..? అంటే అవును అని అంటున్నారు అభిమానులు. నాగ చైతన్య హీరోగా.. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కస్టడీ. ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంటుంది. వెంకట్ ప్రభు.. తన పంధాను మార్చుకొని ఈ సినిమా తీసినట్లు చెప్పుకొస్తున్నారు. తీసుకున్న పాయింట్ బాగానే ఉన్నా.. అది పూర్తి స్క్రిప్టుగా మారే క్రమంలో బిగి.. ఉత్కంఠ లోపించాయి అని, సినిమా మొత్తంలో చూసుకుంటే ఎగ్జైటింగ్ గా అనిపించే ఎపిసోడ్ ఏదీ లేదు. టేకింగ్ లోనూ వెంకట్ ప్రభు తన మార్కును చూపించలేకపోయాడు అని చెప్పుకొస్తున్నారు. దీంతో అభిమానులు కోలీవుడ్ డైరెక్టర్స్.. టాలీవుడ్ కు సెట్ కారా..? అని కామెంట్స్ పెడుతున్నారు.

Show comments