Site icon NTV Telugu

Pakeezah: పెద రాయుడు సినిమాలో పాకీజా గుర్తుందా.. ఇప్పుడు తిండి కూడా లేకుండా ఇలా రోడ్డు మీద

Paakija

Paakija

Pakeezah: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం.. ఇందులో గ్లామర్ ఉన్నంత వరకే అవకాశాలు. ఇక అవకాశాలు ఉన్నప్పుడే రెండు రాళ్లు వెనకేసుకోవాలి. ఎందుకంటే ముందు ముందు జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఎవరికి తెలియదు కాబట్టి. ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ఇప్పుడు దీనస్థితిలో ఉండడం చూస్తూనే ఉన్నాం. డబ్బులేక, తినడానికి తిండి కూడా లేక రోడ్డు మీద సోపులు అమ్ముకుంటూనో, లాటరీ టికెట్లు అమ్ముతూనో తారసపడుతున్నారు. వారి దీనస్థితి వింటే ఎవరికైనా కళ్ళు చెమర్చాల్సిందే. ఇక తాజాగా మరో సీనియర్ నటి రోడ్డుపై బస్సు కోసం ఎదురుచూస్తూ ఒక జర్నలిస్ట్ కంట పడింది. ఆమె ఎవరో కాదు పాకీజా. ఈ పేరు ఇప్పటివారికి తెలియకపోవచ్చు. కానీ, 90 వ దశకంలో ఉన్నవారికి ఆమె ఎంతో ఫేమస్. అసెంబ్లీ రౌడీ సినిమాలో యమా స్టైలిష్ గా బాత్రూమ్ లు కడుగుతూ.. బ్రహ్మీ ని బోల్తా కొట్టించిన అందగత్తె. పెదరాయుడు సినిమాలోనూ అదే పాత్రలో పేరు తెచ్చుకున్న పాకీజా.. తమిళ్ సినిమాలో ఎన్నో మంచి పాత్రలు చేసి మెప్పించింది. ఇక షుగర్ వ్యాధి వచ్చిన దగ్గర నుంచి సినిమాలకు దూరమైన ఆమె ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్పుకొస్తూ కంటనీరు పెట్టుకుంది.

ఆరోగ్యం సహకరించకపోవడంతో అవకాశాలు కూడా రావడం, లేదని తాన్ దీన పరిస్థితి గురించి తమిళనాడు సీఎం కు, నడిగర్ సంఘానికి చెప్పుకున్నా వారు పట్టించుకోవడం లేదని తెలిపింది. ప్రస్తుతం తన స్నేహితురాలిని, నటి జయలలిత చూడడానికి చెన్నై వచ్చినట్లు చెప్పిన ఆమె డబ్బులు లేక బస్సులో వెళ్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ఏమి తినలేదని చెప్పడంతో సదురు జర్నలిస్ట్ ఆమెకు రుచికరమైన భోజనం తినిపించగా.. ఇలాంటి భోజనం తిని చాలా రోజులు అయ్యిందని, ప్రస్తుతం నటి జయలలిత తనకు సహాయం చేస్తుందని ఎదురు చూస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. ఆమె దీనస్థితిని చూసి ప్రముఖులు ఎవరైనా హెల్ప్ చేస్తే బావుంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Exit mobile version