Nani 31: నానికి విలన్ గా మహా నటుడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంటే సుందరానికి… ఈ మధ్య కాలంలో నాని నటించిన లైట్ వెయిట్ సినిమా. జెర్సీ, శ్యామ్ సింగ రాయ్, దసరా లాంటి హెవీ రోల్స్ చేసిన నాని… అంటే సుందరానికి సినిమాలో తనకి టైలర్ మేడ్ లాంటి పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కొంతమందికి విపరీతంగా నచ్చింది, మరికొంతమందికి అసలు నచ్చలేదు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా… అంటే సుందరానికి సినిమాలో నాని కామెడీ టైమింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. అందుకే ఈ కాంబినేషన్ మరోసారి సెట్ అయ్యింది. డిసెంబర్ 7న ‘హాయ్ నాన్న’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న నాని, నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ‘అంటే సుందరానికి’ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ… వివేక్ ఆత్రేయతో నాని సినిమాని అనౌన్స్ చేసాడు. చాలా రోజులుగా వినిపిస్తున్న ఈ కాంబినేషన్ అఫీషియల్ గా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది.
డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా నాని కెరీర్లో 31వ చిత్రంగా రాబోతుంది. #Nani31 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీలో నాని కొత్త సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. అక్టోబర్ 24న గ్రాండ్‌గా లాంచ్ అవనున్న ఈ సినిమాలో నాని పక్కన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా… లేటెస్ట్ గా మేకర్స్ మరో ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు. నాని 31 సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ ‘ఎస్ జే సూర్య’ నటిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేసారు. ఈ మధ్య కాలంలో ఎస్ జే సూర్య నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు నాని సినిమాకి ఎస్ జే సూర్య నటిస్తుండడం తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సినిమా మార్కెట్ కి చాలా హెల్ప్ అవుతుంది. తెలుగు, తమిళ మార్కెట్ ని క్రాక్ చేయడానికి పర్ఫెక్ట్ కాస్టింగ్ ని సెట్ చేసిన వివేక్ ఆత్రేయ, నానితో ఈసారైనా హిట్ కొడతాడేమో చూడాలి.
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
Delighted to have the majestic @iam_SJSuryah on board and he's ready to give you all CHILLS 🤩🤙🏾#Nani31
Natural🌟 @NameIsNani #VivekAthreya @DVVMovies pic.twitter.com/OayBSIthGq
— DVV Entertainment (@DVVMovies) October 22, 2023
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!