koffee with karan: అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన కరణ్ జోహార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో చిట్ చాట్ షో లకు బాప్ ఏది అంటే టక్కున ‘కాఫీ విత్ కరణ్’ అని చెప్పేస్తారు. ఈ షో కు వచ్చిన సెలబ్రిటీస్ ఎంతటి పాపులారిటీ సంపాదించుకున్నారో.. అంతే విమర్శలపాలవుతారు. ఈ షో లో కరణ్ అడిగిన ప్రతి ప్రశ్న ఒక బాంబ్ లా ఉంటుంది. బోల్డ్ ప్రశ్నలు.. బోల్డ్ సమాధానాలు, విమర్శలు, ప్రశంసలు అన్నింటికి ఈ ఒక్క షో నే కేరాఫ్ అడ్రెస్స్. ఇప్పటికి ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఏడవ సీజన్ లోకి అడుగుపెడుతుంది అనుకొనేలోపు కరణ్ జోహార్ బాంబ్ పేల్చాడు. ఇక నుంచి ‘కాఫీ విత్ కరణ్’ఉండబోదని అధికారికంగా ప్రకటించాడు. దీంతో అభిమానులు షాక్ కి గురవుతున్నారు.
“హలో, ‘కాఫీ విత్ కరణ్’ నా జీవితంలోనే కాదు మీ జీవితంలోనూ ఒక భాగమయ్యింది. పాప్ కల్చర్ చరిత్రలో మేము ప్రభావం చూపామని, అందులో మా స్థానాన్ని కనుగున్నామని నేను అనుకుంటున్నాను. కాబట్టి, ‘కాఫీ విత్ కరణ్’ మళ్లీ తిరిగి రాదని నేను చాలా హృదయపూర్వకంగా ప్రకటిస్తున్నాను- కరణ్ జోహార్” అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో బాలీవుడ్ అభిమానులు నిరాశకు గురయ్యారు. సీజన్ 7 కోసం ఎదురుచూస్తున్నామని, ఇలాంటి షాకింగ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామని కామెంట్స్ పెడుతున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు కరణ్ ఈ నిర్ణయం పై పునరాలోచిస్తారేమో చూడాలి.
Also Read
- Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
- VIJAY - TRISHA : విజయ్ - త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
- Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా 'సూరి'
https://twitter.com/karanjohar/status/1521723870494871553?s=20&t=CpJ3C1EGHX_Bv2keFGTgNw
తాజావార్తలు
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!