కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. పాత్రకోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు. ఆ పాత్ర కోసం తగ్గాలన్నా.. పెరగాలన్నా నో చెప్పకుండా చేసేస్తాడు. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న చిత్రం కోబ్రా. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్ సరసన కెజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అప్పుడెప్పుడో మొదటి సింగిల్ ని రిలీజ్ చేసి ఆహా అనిపించినా మేకర్స్.. ఇక ఇన్నాళ్లకి రెండో సింగిల్ ని రిలీజ్ చేశారు.
అధీరా అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వగు మాజాన్ ఈ సాంగ్ ని ఆలపించారు. ఇక ఈ ఒక్క పాటతో ప్రేక్షకులను కోబ్రా వరల్డ్ లోకి తీసుకెళ్లిపోయారు. ఇక ఈ సినిమాలో విక్రమ్ పది గెటప్ ల్లో కనిపించనున్నాడు. ఇక ఈ వీడియోలో విక్రమ్ ఒకదానికొకటి భిన్నంగా ఉండే పలు గెటప్స్ లో కనిపించే మేకోవర్ ని కూడా చూపించడం విశేషం. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.మరి ఈ సినిమాతో విక్రమ్ మరో విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.
