Site icon NTV Telugu

Naga Chaitanya: చైతు మరదలు.. బావా.. బావా అంటూ ఎలా ఆట పట్టించిందో చూడండి

Chy

Chy

Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్క సినిమాలను చేస్తూనే ఇంకోపక్క ఫుడ్ బిజినెస్ ను చూసుకుంటున్నాడు. ఈ మధ్యనే చైతూ షోయూ అనే రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన సంగతి తెల్సిందే. ఇక కొద్దిగా సమయం దొరికినా చై.. తన షోయూను ప్రమోట్ చేసుకుంటున్నాడు. తాజాగా తన పెద్ద మరదలుతో షోయూ లో వంటలు చేసి మెప్పించాడు. మరదలా..? చై మరదలు ఎవరు అనుకుంటున్నారా..? ఇంకెవరు మన వెంకీ మామ పెద్ద కూతురు అశ్రిత. అవును మీ ఇనిఫినిటీ ప్లాటర్ అనే యూట్యూబ్ ను రన్ చేస్తోంది. చెఫ్ అయిన ఆమె రకరకాల వంటకాలను తయారుచేస్తూ ఉంటుంది. ఇక తాజాగా బావ చై రెస్టారెంట్ కు వెళ్లి చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

ఇక రావడం రావడంతోనే మా చైతూ బావా అని పిలిచి ఔరా అనిపించింది. మధ్య మధ్యలో బావను ఏడిపిస్తూ అతనితో కలిసి సూషీలను తయారుచేసింది. వీడియో మొదటి నుంచి ఎండ్ వరకు బావా బావా అంటూ పిలుస్తూ ఎంతో ప్రేమగా మాట్లాడింది. ఇక మరదలిని చూస్తే అసూయ గా ఉందని చై చెప్పుకొచ్చాడు. ఆమె ఇలాంటి వంటలను ఎన్నో రుచి చూస్తుంటుంది అని, ఆ అవకాశాన్ని తాను మిస్ అయ్యాయని, ఆ విషయంలో అశ్రితను చూస్తుంటే జెలెస్ ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ బావా మరదళ్ల వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏదిఏమైనా ఆమె చై ను బావా అని పిలవడం బావుందని చై అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Exit mobile version