Kishkindhapuri : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కిష్కిందపురి. ఇందులో అనపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. టీజర్ మొత్తం థ్రిల్లర్ ను తలపిస్తోంది. హర్రర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను 1989 ప్రాంతంలో కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సువర్ణమాయ అనే ఓల్డ్ బిల్డింగ్ చుట్టూ కథ నడుస్తుందని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఆకాశవాణి తలుపులు తెరుచుకున్నాయ్ అనే డైలాగ్ బాగా హైలెట్ అవుతోంది.
Read Also : JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటివి ఆపేస్తే బెటర్..?
ఈ టీజర్ చూస్తుంటే ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ భయపెట్టేలా కనిపిస్తున్నాడు. హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు కామన్ అయిపోయినా.. సాయి శ్రీనివాస్ కు ఇదే ఫస్ట్ మూవీ. పైగా టీజర్ కూడా డీసెంట్ గా బాగానే ఉంది. ఇప్పటి కాలానికి తగ్గట్టు కాకుండా 1989 ప్రాంతం సెట్స్ వేసి మూవీ తీశారు. అప్పటి కాలానికి తగ్గట్టు మూవీ ఉంటుందనే నమ్మకం టీజర్ ను చూస్తుంటే తెలుస్తోంది. మూవీని సెప్టెంబర్ 12న రిలీజ్ చేయబోతున్నారు. ఇక నుంచి మూవీ నుంచి వరుస అప్డేట్లు ఉంటాయని మూవీ టీమ్ చెబుతోంది.
