Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిరణ్ అబ్బవరంతో కోలీవుడ్ హీరోలు పోటీ యాదృచ్చికమే అయినా ప్రతిసారి హీరోకు ప్లస్సే అవుతోంది. ఎస్ఆర్ కళ్యాణ మండపం హిట్ తర్వాత సరైన సక్సెస్ లేక సతమతమౌతోన్న కిరణ్ అబ్బవరాన్ని మళ్లీ ట్రాక్ ఎక్కించిన ఫిల్మ్ ‘క’. 2024లో దీపావళికి రిలీజై హీరోలో జోష్ నింపింది. అదే రోజు అమరన్‌తో శివకార్తీకేయ్ భారీ స్కోర్ కొట్టేసినప్పటికీ.. కిరణ్ అబ్బవరం ఖాతాలోనూ ఓ హిట్ పడి మళ్లీ అతడిని బౌన్స్ బ్యాక్ చేసింది.
2025లో దిల్రూబా ఫ్లాపైంది. కానీ అప్పుడు ఏ తమిళ హీరోతో పోటీలేదు కిరణ్. ఆ తర్వాత మరోసారి పోటీ అనివార్యమైంది. క సెంటిమెంట్‌తో ‘కె ర్యాంప్’తో మరోసారి దీపావళికి బరిలోకి దిగగా ప్రదీప్ రంగనాథన్ తన బైలింగ్వల్ మూవీ డ్యూడ్‌తో ఓ రోజు ముందుగా పలకరించాడు. రెండు సినిమాలు హిట్ కొట్టినా డ్యూడ్ వంద కోట్లతో అప్పర్ హ్యాండ్ సాధించింది. నెక్ట్స్ చెన్నై లవ్ స్టోరీతో పలకరించబోతున్నాడు కిరణ్ అబ్బవరం. చెన్నై లవ్ స్టోరీతో తమిళ తంబీలను కూడా టార్గెట్ చేయబోతున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ ఏడాది స్ట్రాంగ్ పోటీ మిస్ అవుతున్నానని ఫీలయ్యాడేమో ఏకంగా తమిళనాడు సీఎంతోనే పెట్టుకుంటున్నాడు. విజయ్ లాస్ట్ ఫిల్మ్ జన నాయగన్‌కు ఎట్టకేలకు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్ చేసింది. ఏ సర్టిఫికేట్ జారీ చేయడంతో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. జులై 23 లేదా 24కి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఇదే నిజమేతే విజయ్‌తో కిరణ్ తలపడాల్సిందే. జన నాయగన్ వచ్చినా భగవంత్ కేసరి రీమేక్ కాబట్టి ఇక్కడ కిరణ్ అబ్బవరం సినిమా కలెక్షన్స్‌కు వచ్చిన ఢోకా ఏం లేదని క్రిటిక్స్ వాదన. చూద్దాం స్టార్ హీరోతో కిరణ్ అబ్బవరం పోటీ ఎలా ఉంటుందో.
Also Read
తాజావార్తలు
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!