Site icon NTV Telugu

Rules Ranjann: కిరణ్ అబ్బవరం సరసన ‘డీజే టిల్లు’ భామ!

Kiran Neha Shetty

Kiran Neha Shetty

ఎ. ఎం. రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ లో నిర్మితమౌతున్న సినిమా ‘రూల్స్ రంజన్’. కిరణ్‌ అబ్బవరం హీరోగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ చిత్రాన్ని ఎ. ఎం. రత్నం తనయుడు రత్నం కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ గా ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టిని ఎంపిక చేశారు. విశేషం ఏమంటే ‘రూల్స్ రంజన్’లో బాలీవుడ్ కు చెందిన అన్నుకపూర్, అతుల్ పర్చురే, ఆశిష్ విద్యార్థి, అభిమన్యు సింగ్, విద్ధార్థ్ సేన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమ్రేష్ గణేశ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా 24న ‘సమ్మతమే’!
ఈ యేడాది మార్చి మొదటి వారంలో కిరణ్ అబ్బవరం నటించిన ‘సెబాస్టియన్’ మూవీ విడుదలైంది. అయితే అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా ఈ యువ కథానాయకుడికి పెద్ద బ్యానర్స్ నుండి అవకాశాలు లభిస్తున్నాయి. కోడి రామకృష్ణ కుమార్తె దీప్తి ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ చిత్రాన్ని కిరణ్‌ అబ్బవరం హీరోగా నిర్మిస్తోంది. జీఎ 2 బ్యానర్ నుండి బన్నీ వాసు ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీని నిర్మిస్తున్నాడు. అలానే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనూ కిరణ్‌ అబ్బవరం ఓ సినిమా చేస్తున్నాడు. ఇక అతని తాజా చిత్రం ‘సమ్మతమే’ ఈ నెల 24న విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తోంది. జూన్ 16న ఈ సినిమా ధియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘సమ్మతమే’ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీకి సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ సమకూర్చగా, శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

Exit mobile version