NTV Telugu Site icon

Kiran Abbavaram: వారు నన్ను ఇండస్ట్రీ నుంచి గెంటేయాలని చూస్తున్నారు

Liran

Liran

Kiran Abbavaram: రాజావారు రాణి గారు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా డీసెంట్ హిట్ ను అందుకోవడంతో కిరణ్ కు మంచి అవకాశాలే వచ్చాయి. అయితే కథల ఎంపిక తప్పు అయ్యిందా..? లేక ప్రమోషన్స్ తేడా కొట్టిందో తెలియదు కానీ కిరణ్ కు ప్లాప్ హీరో అని ముద్ర పడింది. దీంతో నెట్టింట ట్రోలింగ్ కు ఈ హీరో బలి అయ్యాడు. పవర్ స్టార్ తరువాత నువ్వే పవర్ స్టార్ అని హైపర్ ఆది ఒక షో లో అనడం.. దానికి కిరణ్ థాంక్స్ చెప్పడంతో ఈ ట్రోలింగ్ ఇంకా ఎక్కువ అయ్యింది. పవర్ స్టార్ తో పోల్చుకుంటున్నాడు అంటూ పవన్ ఫ్యాన్స్ దగ్గర నుంచి అందరు అతడిని టార్గెట్ చేసి మీమ్స్ తో అతనిపై నెగిటివిటిని స్ప్రెడ్ చేశారు. ఇక అంత నెగెటివిటీమీ అందుకున్నా కిరణ్ ఏరోజు ట్రోలర్స్ పై స్పందించింది లేదు. ఇక తాజాగా మొదటిసారి ఆ ట్రోల్స్ కు సమాధానం ఇచ్చాడు కుర్ర హీరో.

ఇక కిరణ్ నటించిన కొత్త చిత్రం వినరో భాగ్యం విష్ణు కథ టీజర్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఈవెంట్ లో కిరణ్ మాట్లాడుతూ ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ” నేను బాగా కావాల్సినవాడిని సినిమా ఎంట్రీలో నా పేరు కిరణ్ అబ్బవరం అనే ఉంటుంది. కానీ, మీమర్స్ నా పేరు ముందు పవర్ స్టార్ యాడ్ చేసి ట్రోల్ చేశారు. నేను చేయకపోయినా నా మీద కావాలనే ట్రోల్స్ వేసి నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. నన్ను ఇండస్ట్రీ నుంచి గెంటేయాలని చూస్తున్నారో ఏమో తెలియడం లేదు. ఇప్పటివరకు నేను ఈ ట్రోల్స్ పై స్పందించకపోవడం వల్లే ఇలా జరుగుతోంది. నేను చేయని తప్పుకు నన్ను అనకండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కిరణ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఏదిఏమైనా కిరణ్ ట్రోల్స్ విషయమై చాలా బాగా హార్ట్ అయ్యినట్లు కనిపిస్తున్నాడు. ఇప్పుడు ట్రోలర్స్ కు గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో ఈ ట్రోల్స్ ఏమైనా ఆగుతాయేమో చూడాలి.

Show comments