NTV Telugu Site icon

Meter Trailer: వాడు బాల్ లాంటోడు.. ఎంత కొడితే అంత పైకి లేస్తాడు

Meter Trailer

Meter Trailer

Kiran Abbavaram Meter Trailer Released: వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న యువ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్‌గానే ‘వినరో భాగ్యము విష్ణు కథ’తో మంచి విజయం సాధించాడు. ఇప్పుడు అతడు ‘మీటర్’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే టీజర్, పాటలు విడుదలవ్వగా.. ఇప్పుడు చిత్రబృందం లేటెస్ట్‌గా ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇది ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని ఈ ట్రైలర్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఇందులో కామెడీ, లవ్ స్టోరీ, యాక్షన్ సీన్స్‌ని బట్టి చూస్తుంటే.. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్‌ని కిరణ్ ప్రెజెంట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Pawan Kalyan: ఆ హ్యాష్‌ట్యాగ్‌నే టైటిల్‌గా ఫిక్స్.. ఇంకా వీడని ఆ మిస్టరీ

నిర్లక్ష్యంగా ఉండే ఓ పోలీస్ అధికారి.. డెడికేటెడ్‌గా పని చేయకుండా అమ్మాయి వెంట పడుతుంటాడు. తర్వాత తండ్రి ప్రేరణతో డ్యూటీని సీరియస్‌గా తీసుకునే అతను, ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ లీడర్‌తో గొడవ పడతాడు. ఇక అక్కడి నుంచి సినిమా ఎలా సాగుతుందన్నదే ఈ సినిమా స్టోరీలా కనిపిస్తోంది. పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో కిరణ్ ఇరగదీసినట్టు కనిపిస్తోంది. విజువల్స్ గ్రాండ్‌గా అనిపించాయి. సాయి కార్తీక్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ ట్రైలర్‌కి ప్రాణం పోశాడని చెప్పుకోవచ్చు. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయినట్టు స్పష్టమవుతోంది. ఓవరాల్‌గా చెప్పుకోవాలంటే.. ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి, సినిమాతోనూ ఇలాగే ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.

Samantha Ruth Prabhu: నాకు ఆ అవసరం లేదు.. తేల్చి చెప్పేసిన సమంత

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. ఇది ఇప్పటివరకూ కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా. ఇందులో కిరణ్ సరసన అతుల్యా రవి కథానాయికగా నటించింది. ఏప్రిల్ 7వ తేదీన ఇది థియేటర్లలో విడుదల కాబోతోంది.

Show comments